శాసననిర్వహణస్వరూపము
67
ఎట్లైనను, పైనవ్రాసినవిషయములన్నిటిని ఆలోచించినయెడల నిజముగా స్వపరిపాలితరాష్ట్రముల లోనే అధికారశాఖకు సహజపరిస్థితులనుబట్టి యెంతటి ప్రాబల్యముండునదియు నర్థము కాకపోదు. ఉత్తమాధికారి యీ శాఖ కంతటికిని తలమానికము. పరిపాలనయనునట్టి బహుశాఖాన్వితమహా కార్యమున కాతడు జీవకళ. శాసనసభ ప్రతినిధిగా ఈకార్యమునంతయు నిర్వహింప దక్షత కలవాడు. శాసనసభలో ప్రత్యక్షముగనో మరియేరీతినియో శాసనోపక్రమణము చేయుట యందతనికి తగినంత స్వాతంత్ర్యము కలదు. శాసనసభలలోకల పలుకుబడిచేతను, శాసనములను రద్దుచేయు సధికారముచేతను, తాత్కాలిక శాసనములనుచేయు స్వాతంత్ర్యముచేతను, శాసనసభలను కూర్చుట వాయిదా వేయుట రద్దుచేయుట ఇత్యాదివిషయములలోగల యధికారముచేతను, ఇతరరాష్ట్రములతో సంధిసంబంధములు నిర్ణయించుటలోగల యధికారముచేతను, సైన్యాదికముల సర్వాధిపత్యముచేతను దోషస్థు లనుకొనినవారిని సయితము క్షమించుబలము కలవాడగుటచేతను అత డసమానశక్తి కలవాడగుచున్నాడు.
ఉత్తమాధికారి నియామకము
కాబట్టి యీయుత్తమాధికారిని నియమించుటలోను, వశవర్తినిచేసికొనుటలోను నాగరకరాజ్యములు బహు జాగరూకతతో నియమనిబంధనలను కావించుకొనియున్నవి.
ఉత్తమాధికారి నియామకము ఎల్లరాష్ట్రములలోను ప్రజలయాధీనము నందులేదు. కొన్నిరాజ్యములలో