50
ప్రభుత్వము
గలదు. అధమపక్షము 50000-ల వోటరులయినను చేరిననుగాని ఈ యధికారము వినియోగింప వీలులేదు. జర్మనీలోను నిట్టియధికారము ప్రజలకు ప్రసాదితమయి యున్నది. కాని నేడేర్పడియుండు డిక్టేటరులపద్ధతిలో వీని కర్థము లేదు.
వోటరులచేతిలోని మూడవ యాయుధము రెఫరెండము. కొన్నికొన్ని సందర్భములలో శాసనములను గురించియు, ముఖ్యవిషయములను గురించియు తాము స్వయముగానే అభిప్రాయము వ్య క్తము చేయుపద్ధతి కీపేరుకలిగినది. ప్రభుత్వములవారు అట్టి యభిప్రాయమును అమలుజరుపవలసియు నుండును. పరగణాలను, మండలములను నేర్పరచుటలో సరిహద్దులను నిర్ణయించుటకును; భాషలప్రాబల్యమును నిరూపించుటకును నొకప్రాంతపు ప్రజ లింకొకప్రాంతములోచేరుట కిచ్చగింతురా లేదా యనుటను నిశ్చయించుటకును నీపద్ధతి చాలయుపయోగపడినది. కడచిన యైరోపా మహాసంగ్రామానంతర మేర్పడిన చిన్నచిన్న రాష్ట్రములసమస్యలు పరిష్కరించుటలో నీపద్ధతి మాటికిమాటికి ననుసరింపవలసివచ్చినది. స్వయం నిర్ణయసూత్రమని ప్రచారమందిన సిద్ధాంతమున కిది సాధనముగా నుపకరించుచున్నది. అస్పృశ్యుల దేవాలయ ప్రవేశమునకు మనశాసనసభలలో పెట్టదలచిన శాసనము నమలుజరుపనెంచినచో ఈపద్ధతి నవలంబించవలెనను బునాది వై చినారు.
ఇనీషియేటివు, రీకాలు, రెఫరెండము పద్ధతులు శాసనబద్దముగా ప్రచారమునందున్నను, లేకపోయినను వా