శాసననిర్మాణస్వరూపము
49
ప్రతినిధిసభలలోని లోపములచేతను, ప్రతినిధులలోపముచేతను కలుగునట్టి కష్టములను నివారించుకొనుటకు నేటి రాష్ట్రములు రెండు మూడు క్రొత్తఏర్పాటులను కావించుకొనినవి. తాము పంపిన ప్రతినిధిని తాము పదచ్యుతుని గావించుట యొకపద్ధతి. వోటరులలో ఇందరుకోరుదు రేని రాజీనామానియ్యవలయునని గాని స్థానము ఖాళీపడినట్లెంచవలసినదనిగాని నియమించుట దీనికిమార్గము. ఇట్టిమార్గమున కింగ్లీషులో 'రీకాల్ ' అని పేరుపెట్టినారు. ఇది విశేషము ప్రచారమునందులేదు. అమెరికాసంయుక్త రాష్ట్రములలో కొన్నిమునిసిపాలిటీలలో కలదందురు. ఇది యాచరణయోగ్యమని తోచదు. కారణము స్పష్టము, ప్రతినిధిని పంపునుద్దేశము కార్యకరణము. అందు స్వేచ్ఛకొలదిగానైన నుండదగును. లేకున్న నిత్య శంకితులే ప్రతినిధులు కావలసియుందురు. నిత్యశంకితులకు కార్యనిర్వహణశక్తియుండదు. వోటరులు ఎప్పుడు కోరిననప్పుడు తన్ను కార్యమునుండి మరల్తురను విశ్వాసముకలవానికి దీక్షయును కొరవడును. ఈకారణముల చేత 'రీకాల్ ' పద్ధతి యెక్కువ వ్యాప్తినందినదిగాదు.
వోటరుల కింకొకమార్గము 'ఉపక్రమాధికారము.' దీనినే ఇంగ్లీషులో 'ఇనీషియేటివ్' అనినారు. ఏశాసన మైనను చేయవలసినదనిగాని, ఏరాజ్యకార్యములైనను నిర్వహించవలసినదనిగాని వోటరులలో అధికసంఖ్యాకులు తమయభిప్రాయమును వ్యక్తపరచవచ్చును. అప్పుడు ప్రభుత్వమువారు ఆవిషయమై యాలోచింపక తీరదు. ఇట్టి 'యుపక్రమాధికారము” వోటరులకు అయిర్లండులో