Jump to content

పుట:Prabhutvamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

47

ప్రతినిధిగానుండు వాడెవడైనను తనయధికారమును తా నెరుంగుట కష్టముగానున్నది. రాజ్యలాభాలాభము లొకవైపునను, తన్ను నిర్వచించిన ప్రాంతలాభాలాభము లొకవైపునను నుండ సమన్వయమెట్లుచేయవచ్చుననునది ఇతనికి గొప్పసమస్య యగుచున్నది. స్థూలదృష్టిని చూచినప్పుడు ఈరెంటికిని వైరుధ్యము ఉన్నయట్లు కానరాదు. రాజ్యములో భాగమగుప్రాంతమునకు ఏదిలాభకరమో అది రాజ్యమునకు లాభకరముకావలసినదే. ప్రాంతముల ఏకత్వమగు రాజ్యమున కేది లాభకరమో అది ప్రాంతములకు లాభకరము కావలసినదే. ఈసిద్ధాంతము బాగుగనే యున్నది కాని పలుమారు దినదినమును ఈసిద్ధాంతమునకు కొలదిగనో, గొప్పగనో కార్యక్రమమున విఘాతము కలుగుచుండును. దృష్టాంతములు కావలయునా ? నేడు మనరాజధానిలోను మన ఆంధ్రభూమి లోను పొడసూపిన సమస్యలనే యాలోచింతము. ఆంధ్రులగు మనకు ఆంధ్రరాష్ట్ర మావశ్యకము. మనద్రవిడసోదరులలో ననేకుల కది యిష్టములేదు. మన మిరుతెగలవారమును శాసనసభలో నున్నారము. మనప్రతినిధు లెట్లు ప్రవర్తింపవలెనో యెవరు చెప్పగలరు! అట్లే కృష్ణమండలము రెండు కానున్నదనుకొనుడు. క్రొత్తమండలమున కేది ముఖ్యపట్టణము? ఆంధ్రప్రతినిధి తనమండలమువారి యభిప్రాయానుసారము పోవలయునా లేక తానాంధ్రదేశమున కనుకూలమనుకొను రీతిని ప్రవర్తింపవలయునా?

నిజముగా ప్రతినిధికర్తవ్యము తన్నెన్నుకొనినవారు చెప్పినట్టుగా మాత్రముచేయుట యనరాదు. ఏలయందు