46
ప్రభుత్వము
యేర్పాటగునాయనునది, యోచింపదగియున్నది. ఎక్కువ సంఖ్యాకులై మన మున్నంత మాత్రముచేత తక్కువ సంఖ్యాకులైన యెదుటివారి నోరు మూయించ వలసినదేనా? ఇది సరియనుడు, తప్పనుడు ఆచారముమాత్రము లోకమున స్థిరమయినది. కొంతవిమర్శ సాగినపిదప ఏసభలోనైనను ఒకసభ్యుడు లేచి ఈవిమర్శ చాలించవలసినదని యుపక్రమింప వచ్చును. అట్లుపక్రమించినప్పుడు కొన్ని కొన్నిసభలలో అధ్యక్ష స్థానమున నుండువారు . సభవారి సమ్మతి తీసికొనవలసియుందురు. ఎక్కువ సమ్మతులు నిలుపుడు పక్షముననుండెనా నిలుపుదల చేయవలసియుందురు. మరికొన్ని సభలలో తీర్మానముచేయు నధికారము అధ్యక్షస్థానమున నుండువారికే యొసంగబడినది. ఆంగ్ల రాజ్యాంగసభలోని ఏర్పాటు ఇదియే. అచ్చట అధ్యక్ష పదవియం దుండువానిని 'స్పీకరు' అందురు. ఆతని ఇష్టము వచ్చినయెడల ఆపుదలచేయవచ్చును; లేకున్న విమర్శ జరుగును గాకయని వదలవచ్చును. అమెరికాసంయుక్త రాష్ట్రములలోని ప్రజాప్రతినిధిసభలో మాత్రము సభ్యు బూరక మాటలాడుట కలదట ! తమమాట సాగదనుకొనువారు ఊరక మాటలుపెట్టి ఎదుటివారిని విసిగింపజూచుట సహజము. కాబట్టి అమెరికాసంయుక్తరాష్ట్రములలోను నిర్బంధ మవసరమని ప్రయత్నములగుచున్నవి.
ప్రతినిధి
శిష్టసభలో సభ్యుడుగా నుండు వాడైనను సరియే, ప్రజాప్రతినిధి సభలో సభ్యుడుగానుండువాడైనను సరియే