పుట:Prabhutvamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ప్రభుత్వము

యున్నప్పుడు 'కక్షల గడబిడ నిర్వచనములలో నంతగా ప్రతిఫలింపదనియు ఎక్కువ సంఖ్యలు సమ్మతులిచ్చు నెడల నొక్కొక్కప్పుడు కొరగానివారుగూడ ప్రతినిధులై పనులు చెడవచ్చుననియు తలంచుటయే యిందుకు బునాది. అయిన ఇట్టిభావము లెంతవరకు నిజములో పరిశీలించుట యవసరము. పరోక్షపద్ధతి కార్యక్రమమున నెంతో విజయవంతముగా పనిచేయ లేదనుట మొదట గమనింపదగినది. కక్షల గడిబిడ లేకుండుననుటయు కల్ల. ఏలయందురా, శిష్టసభకు సభ్యులను నియమించునట్టి మధ్యస్థులెట్టివారో యాలోచింపదగియున్నది. వీరుతప్పక 'కక్షలలో' నేదైనను నొక్కదానికి జేరియుందురుగాని వేరుకాదు. కాబట్టి వీరుచేయు నియామకమును 'కక్షలకు' సంబంధపడియుండక తప్పదు. మరి పరోక్షనిర్వచనమున నిర్వాచకవర్గము (ఓటరులవర్గము) కడుంగడు తక్కువ. అందుచేత అభ్యర్థిగా నుండునట్టివాడుగాని, అతని మిత్రులుగాని ఈతక్కువ సంఖ్యాకులను అవినీతి పద్ధతు లవలంబించి లోబరచుకొనుట సులభము. ప్రత్యక్షపద్ధతియందు నిర్వాచకులసంఖ్య యపరిమితము కావున నిట్టిపద్ధతులకు తావెక్కువగా నుండదు. ఇంతేకాదు. ప్రత్యక్షనిర్వచనపద్ధతియున్న యెడల సమ్మతినీయ నర్హుడగు నొక్కొక్కరును ప్రతినిధి నన్నుకొనుట యం దెక్కువ యుత్సాహమును, అభినివేశమును జూపుటకు వీలుకలదు. అట్లుగాక ఎవ్వరో ఇతరులు శిష్ట సభకు తనపక్షమున ప్రతినిధినెన్నుదురనిన నాతని కంత దూరము పట్టుదలయుండకపోవును. కడపటిమాట. మధ్యవర్తిని ఎన్నుకొనుటకు శక్తిశ్రద్ధలు నిర్వాచకునకు కల