పుట:Prabhutvamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

35

వని యభిప్రాయపడిన పిదప ప్రతినిధి నేరుకొనుట కేల అతనికి శక్తిశ్రద్ధలు లేవనుకొనవలయునో నిర్ణయించుట యసాధ్యము. కాబట్టి లోకమంతటను ప్రత్యక్షపద్ధతియే “శిష్టసభ'కును నెక్కువ యెక్కువగా నన్వయమగుచున్నది,

ఇతరాధారములు

పరోక్షనిర్వచనపద్ధతి పనికిరాదను కొనినచో రెండుసభల తారతమ్యమునకుగల యితరాధారము లేవియో విమర్శింప దగియున్నది. ప్రజాప్రతినిధిసభకును శిష్టసభకును సభ్యుల నెన్నుకొనునట్టి ప్రాంతములలో అనగా దేశవైశాల్యములో విభేదముకల్పించుట యొకయాధారముగా నంగీకృతమయి యున్నది. ప్రజాప్రతినిధిసభకు ఫిర్కాలు, తాలూకాలు ప్రతినిధుల నెన్నుకొనుచో శిష్టసభకు మండలములు, కోస్తాలు నియమితమగుటకలదు. ఈకారణముచేత 'శిష్ట' సభలో ప్రజాప్రతినిధిసభ యందుకంటె తక్కువసంఖ్య యుండుట సంభవించుచున్నది. ఈతక్కువ సంఖ్యాకులెక్కువ వివేకవంతులుగా నుందురను భావనయు నొక్కటికలదు. ఇదివరలో జెప్పినరీతిని అమెరికాసంయుక్త రాష్ట్రములలో ఈ “శిష్ట' సభ నిర్మాణసమస్య యుత్తమరీతిని తీరువబడినది. విస్తీర్ణమునందును జనసంఖ్యయందును విస్తారమైనతారతమ్యము లున్నప్పటికిని సంయోగమునందలి యన్ని రాష్ట్రములకును సమానముగా సంబంధించిన విషయములలో సమత్వము కలుగజేసి తన సంఖ్యలబలముచేతనే యొక్క రాష్ట్రము తనపలుకుబడినే చెల్లించుకొనకుండ నిరోధించుటకు ఈసభ వినియోగపడుచున్నది. స్విట్‌జరులాండులోను ఈవినియోగమే యను