పుట:Prabhutvamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ప్రభుత్వము

ప్రదేశములలో వేర్వేరుకాలములలో నియ్యది భిన్నభిన్న రూపములుగా వేర్వేరుఛాయలుగా పొడసూపినది. అందుచేత నేటిపరిస్థితులలో ప్రభుత్వము అను అధికారము నడుచునట్టి పథము నెఱింగినంగాని అందరితో సమానముగా మనమును ప్రపంచచరిత్రమున పాల్గొనజాలము. ప్రపంచమున నన్నిప్రాంతములయందును పాశ్చాత్యజాతుల ప్రాబల్యమువలన కొంచె మించు మించుగా నొకేవిధమగు ప్రభుత్వస్వరూపము ఏర్పడునట్టి మార్గము దోచియున్నది. ఆమార్గమును అనుసరించి నేటిదినము మనదేశములోను స్వరాజ్యమును నెలకొల్పుటకు ఉద్యోగములు జరుగు చున్నవి. ఆమార్గము లేవియో వివరించుట ఆకారణము చేత నవసరము.

పాశ్చాత్యజాతుల ప్రాబల్యముచేత ప్రభుత్వాధికారము ఒక్కరీతిని నేర్పడ నారంభించినది యనుటచేత ఆ యాకారమంతయు మనకు క్రొత్తయనికాని మనదేశమున నట్టియాకారమే యుండలేదని కాని తలంప రాదు. మనదేశమునందు ప్రాచీనకాలములో వ్యాపించియుండిన సంస్థలు నేటిపాశ్చాత్య రాజకీయసంస్థల పితామహప్రపితామహ స్థానమునుండి మన జీవితసిద్ధాంతములమీద నాధారపడి యుండినందున నింతకన్నను నెన్నియో మడుంగులు ప్రజాశాంతికి అనుకూల తరములుగా నుండెననుట నిక్కువము. వానిసూక్ష్మవివరణ మంతయును ప్రస్తుతవిషయముగాదు.



__________