పుట:Prabhutvamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

మూడు విధములు

నేడు అంగీకృతమైయుండు రాజకీయసిద్ధాంతానుగుణముగా ప్రభుత్వమను నధికారము మూడువిధములుగా పరిస్ఫుట మగుచున్నది.

శాసననిర్మాణము

(1) దీనినే తేట తెనుగున చట్టములు చేయుట యందురు. వేలకొలది ప్రజలకు సంబంధించిన పనులు చేయవలసియున్నప్పుడు ఆలోచనచేయకుండ పనిచేయ రాదుగదా! ఆయాలోచనయైనను నిమేషనిమేషమునకును మారుచుండు నట్టిదిగా నుండరాదుగదా! బాగుగా ఆలోచనచేసి మనము పద్ధతిని మార్చుకొనువరకును ఈవిషయమై ఈవిధముగా మనదేశములో పనులు జరుగుచుండ వలసినది అని తగిన పదిమందిచేరి నిశ్చయము చేసికొనుటకే చట్టముచేయుట యని పేరు. అట్టిసభలకే శాసననిర్మాణసభలనియుపేరు. ఆయధికారమునకే శాసన నిర్మాణాధికార మని పేరు.

శాసన వివరణము

(2) ప్రజాసమూహమునకు సంబంధించిన కట్టుదిట్టము దినదినము మారుచునుండరాదని చెప్పితమి. సంవత్సరము సంవత్సరము మారుచుండవచ్చునా యని ప్రశ్నించికొందము. ఇదియు పొసగునట్టి పనికాదు. తరములు తరములు యుగములు యుగములుగా చట్టములు అమలులో నున్నవి. మనదేశములో ఇప్పటికిని మనుధర్మ