పుట:Prabhutvamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనవివరణస్వరూపము

111

చేసిన నొక్కదండన. ప్రజ యదేతప్పుచేసిన నింకొకదండన. మనదేశమునందును ఇట్టిస్థితిగతు లొక్క కాలమున నుండెననుట మనుస్మృతి ఇత్యాదులవలన దెలియుచున్నది. నేటిదిన మిట్టి విపరీతము లన్నియును నశించినవి. న్యాయస్థానమున సర్వజనులును సమానులనుట సిద్ధాంతమైనది.

ఇంతేకాదు. నేటిదినము న్యాయవిచారణపద్ధతులును సున్నితములయినవి. ముక్కోణములకు కట్టి కొట్టి నేరములను నొప్పుకొనునట్లు చేయుకాలములు గతించినవి. మల్లయుద్ధములు, పిస్తోలు యుద్ధములుచేసి న్యాయమును స్థాపించు దినములు గడచినవి. అగ్గినురికి, నీటమునిగి, బాసలుచేసి తీర్శానముచేయునట్టి యుగములు మారినవి. దోషస్థుడనిన కాళ్లుకోసి, చేతులుగోసి, కఠినకారాగార ములలోత్రోసి దోషమున నాత డింకను నెక్కువగా మునిగి పగతీర్చుకొనుటకు పట్టుపట్టునట్లుచేయు కాలము లంతరించినవి. తుదకు అధికారులు ఇష్టమువచ్చినవానిని ఇష్టమువచ్చినట్లుగా పట్టి నిర్బంధించు నేర్పాటులును తగ్గుచున్నవి. మనదేశములో నింకను నెక్కువగా నీవిషయమున సౌకర్యమేర్పడుట లేదు. ఇంకను నిచ్చట 'జనరలు వారంటు'లకు నెడమున్నది. అనగా ఊరుపేరులేక ఇట్టి నేరమనియైనను వ్రాయక న్యాయాధికారులు అధికారవర్గములోని వారిచేతికి వారంటులు వ్రాలుచేసి యిచ్చుటకు వీలున్నది. ఏసబ్ ఇనస్పెక్టరో తన యిష్టముకొలది ఈవివరములు తరువాత వ్రాసికొనవచ్చును. ఇట్టి వారంటులు ఇంగ్లండులో చెల్లవు. అంతేకాక ఇంగ్లండులో కోర్టువారికి కారణము కనుబరచక యెవ్వరిని నిర్బంధమున