పుట:Prabhutvamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ప్రభుత్వము

నుంచుటకేలేదు. మనదేశములోను ఇట్టి యేర్పాటు లత్యవసరములని పెద్దలు కోరుచున్నారు.

ఇంతటి సున్నితములయిన సాధనములు న్యాయవిమర్శకు ఏర్పడియు, ఏర్పడుచుండియుగూడ కోర్టులలో న్యాయమే జరుగుటలేదనువార్త లోకమంతటను మెండైనది.

ఇందుకు కారణ మరయవలయును. న్యాయవిచారణకు ముఖ్యాధారము సాక్ష్యము. స్థానమువదలి పోయిన సాక్ష్యము మాఱిపోవును. స్థానికులకు సమాచారములు తెలిసినంత బాగుగ తదితరులకు తెలియవు. అంతియగాక స్థానికుడుగా నుండువాడు అదేస్థానమున నబద్ధములాడి యొరునకు చెరుపుచేసి కాలుదన్ని నిలుచుట కష్టము. అదియుంగాక తమతమ ప్రదేశములలో న్యాయమే జరిగితీర వలయుననుట తత్తత్ప్రదేశజులకు పట్టుదలగానుండును. ఏలయన, సర్వజనులు సుఖముగా నుండుటకు అక్రమములు జరుగకుండుటయు, జరిగినప్పుడు ఆక్రమపరుడు శిక్షితుడగుటయు నత్యవసరము. అట్లు జరుగక అక్రమమే న్యాయస్వరూపముదాల్చి దంభముగా తిరుగ నారంభించునేని లేనిపోని కలతలు కలిగి కష్టములుతోచి యొక్కరిపై నొక్కరికి విశ్వాసము లేక యునికియే దుర్భరమగును. కాబట్టి యెల్లప్పుడు నలుగురుస్థానికులు న్యాయముచెప్ప నర్హులనుట ఉత్తమనాగరకరాష్ట్రములలో నంగీకృతమయినది. పరస్పరసహాయసానుభూతులే జీవితమునకు బునాదులైన యీభారతభూమిలో ననాదిగా పంచాయితికి ప్రబలాధికార మీయబడినది. బ్రిటీషుకోర్టు లేర్పడు