పుట:Prabandha-Ratnaavali.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

చ. తెలతెలవాఱు నొయ్యనరుదెంచు నిశాంత రతాంతతాంతలొ
చెలువలకింపుగా మెలఁగుఁజెక్కులఁగూరిన చూర్ణకుంతలా
వశిసర సంబుగా జడియు వాలిన సెజ్జలమీది ప్రావిరుల్
దొలఁగఁగఁజేయు నూడిగపు తొయ్యలులంబలె వేగుదెమ్మెరల్ (487)

ఈ పద్యము పాండురంగ మాహాత్మ్యములోనిది 1-118.

తెనాలి రామలింగకవి -ఉద్భటారాధ్య చరిత్ర,

కాకమాని గంగాధరుడు బాలభారతము (182)

శా. సంసారార్ణవ పారగున్ పరమహంసవ్రాత చూడా పదో
వంసంబున్ శ్రుతి సంక రోడ్డళన పాథ 'క్షీర భేద క్రియా
హంసంబున్ జగదేకవంద్యు జలదశ్యామున్ మహాపాతక
ధ్వంసాబారతు ధారతామృతనిధిన్ వ్యాసున్ బ్రశంసించెదన్.

ఈ పద్యము రామలింగకవి ఉద్భటారాధ్య చరిత్రముసగల యీ క్రింది పద్యము ననుసరించినది.

శా, సంసారాహ్వయాసింధు పోతము జగత్సంబోచ దీపాంకురున్
కంసారాతి పదాబ్దబంభరము సాక్షాత్పద్మ గర్భున్ బుధో
వంసంబున్ శ్రుతి సంక రోడ్డళనపాథః క్షీరథీవక్రియా
హంసంబున్ బరిశీలిత స్మృతిరసున్ వ్యాసుంబ్రశంసించెదన్ (1-9)

నందితిమ్మన (పారిజాతాపహరణము)

గ్రంథనామము కర్తనామము తెలియరానిది

గీ. అమరులమృతాబ్ధిలో పలి యమృతరసము
నిండి చేరులపటికంపుఁ గుండగట్టి
చేదుకొనియెదరో నాగ శీతరోచి
మెల్ల మెల్లన రుచులతో మిన్ను వ్రాఁకె.

ఇది తిమ్మన పారిజాతాపహరణము 2-88 వ పద్యము,