పుట:Prabandha-Ratnaavali.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59


గీ. కావ్యనాటకలసదలంకారముఖ్య
విద్యలన్నియు నెఱుఁగని విప్రవరుడు
పంచయజ్ఞములును లేని బ్రాహ్మణుండు
వెదకిచూచిన బొడమండు వీటిలోన.

ఈ పద్యమే కొలది మార్పుతో మల్హణ చరిత్రలో నిట్లున్నది.

సీ. అంగయుక్తంబుగా నామ్నాయములు రెండు బల్లిపాఠంబుగాఁ బరిచయించే
బ్రహ్మాండ శైవాడి బహు పురాణఁబులు కరతలామలకంబుగా నెఱింగే
థాట్ట వైశేషిక ప్రముఖ శాస్త్రంబులు నవగతంబులుగాగ సభ్యసించే
శుకుల వ్యాసాది దేశికుల తత్త్వార్థముల్ శోధించె నామూలచూడముగసు

<poem>గీ వాదవహ్నా జలస్తం భవాదులరసి
నంజ వాకర్షణక్రియ లలమిఁ గనియె
సరస సంగీత సాహిత్య సరణి దెలిసె
సఖిల విద్యావిశారదుండయ్యె సంత, (1-6)

</poem>

తెనాలి రామలింగయ్య

ఈతని కందర్పకేతు విలాసమునుండి సోలుగు పద్యము లుదాహరింప బడినవి (425-428).

ఈ కందర్పకేతు విలాసమునుండి యొక పద్యము కవిగారిట్లుహదా రించినారు,

"లలితాస్యాంబురుహంబు నీలక చరోలంబంబు నేత్రాసితో
త్పలముచ్చైస్తనకోక మోస్థ విలసద్బంధూకముచ్యత్కటీ
పులినం బుద్ధతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
జలజావాసముఁడొచ్చియాడక మనోజాతానలంబారునే.'

(కుమారసంభవము ప్రథమ భాగము పుట 107)

తెనాలి రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యము తెనాలి రామలింగకవి హరి లీలావిలాసములోనిదిగా నీ క్రింది పద్య ముదాహరింపబడినది..