పుట:Peddapurasamstanacheritram (1915).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరామాయనమ:

శ్రీ

పెద్దాపురసంస్థాన చరిత్రము.

{{center|

పూర్వము పెద్దాపుర సంస్థాన మాంధ్రదేశమున నొక భాగముగ నుండెను దానిని రమారమి మూడు వందల సంవత్సరములవరకూ శ్రీ వత్సవాయ వంశీయులగు క్షత్రియులు పరిపాలించి యున్నారు. ఇప్పుడా సంస్థానములలోని కొన్ని చిన్న జమిందారీలును, ముఠాలును మాత్రమే ఒకప్పుడు పెద్దాపుర సంస్థానములలోని వనటకు నిలిచియున్నవి ఇప్పుడు పెద్దాపురం ఒక తాలూకా గ్రామముగా వుండి ఆంగ్లేయ దొరతనమువారి పెక్కు కార్యాలతో విలసిల్లుతుంది. పూర్వం ఈ పెద్దాపురం - పిఠాపురం ప్రాంతాలు " పొర్లు నాడు " అని పిలవ బడేవి - పెద్దాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు నది ప్రవహించడం వాళ్ళ దీనికి ఆ పేరు వచ్చిందని అనేవారు. 'ఈ ఏలేరు ఆధారము వలననే పల్లపు భూములలోని చాలా బాగం సాగు చేయబడుచున్నది. ఇక్కడ మెట్ట పంట విరివిగా పండును. గోదావరి జిల్లాలన్నిటిలో ఇతర తాలుకా గ్రామాలన్నిటినీ పోల్చి చూస్తే ఇక్కడ జన సంఖ్య తక్కువగా ఉన్నది. ఇక్కడ చదరపు మైలుకి (కిలోమీటరున్నర) కి సుమారు 331 మంది మాత్రమే కలరు. పల్లపు తాలూకాల కంటే విద్యా విషయం లో వెనుకబడి వుంది. పురుషులలో నూటికి 5 శాతం ప్రజలు మాత్రమే చదవడం, వ్రాయడం నేర్చుకొన్నారు. ఉ త్తర సర్కార్లు అని పిలువబడే ఆంధ్రదేశ బాగంలోని ఈ పెద్దాపురం సంస్థానమును పరిపాలించిన శ్రీ వత్సవాయ రాజ వంశీయులు సూర్యాన్వయ సంభవులనీ వీరికి మూల పురుషుడు సాగిపోతరాజు అని ఏనుగు లక్ష్మణకవి గారు తన రామ విలాసం అనే గ్రంధములో

శ్రీవిష్ణునాభిరాజీమధ్యంబున బ్రభవించె విశ్వనిర్మాత ధాత.
యంభోజభవునకు సంభవించె మరీచి యతనికి గశ్యపుండతవరించె
గశ్యపబ్రహ్మకు గలిగె బ్రహ్మాండదీపకుడు త్రయిమూర్తి భాస్కరుండు
ననజముత్రునకు వైవస్వతుండుదయించె ఘనుడు వైవస్వతమనువు గాంచె