పుట:Paul History Book cropped.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని క్రీస్తుని నిరాకరించినవాళ్ల గతియేమిటి? మొదటలో పౌలు క్రీస్తుని నారాకరించిన యూదులు నాశమై పోతారు అని వ్రాసాడు -2 తెస్స 19. కాని చివరలో వ్రాసిన రోమా పౌరుల జాబులో దేవుడు అందరిపై కృపజాపుతాడు అని నుడివాడు -11,32. ఇది ఆనాటి యూదులనుగూర్చి చెప్పిన వాక్యం. ఐతే ఇక్కడ అతడు యూదజాతిని గూర్చి సమష్టిగా మాట్లాడుతున్నాడు. ఆ జాతిలోని ప్రతివ్యక్తిని గూర్చి చెప్పడం లేదు. కనుక లోకాంతంలో ప్రతివ్యక్తి రక్షణం పొందుతాడని పౌలు బోధించలేదు.

4. ఉత్థాన జీవితం ఏలా వుంటుంది?

మనకు ఈ లోకంలో భౌతిక శరీరాలు వుంటాయి. కాని మోక్షంలో ఈ భౌతిక శరీరం ఆధ్యాత్మిక శరీరంగా మారిపోతుంది. గ్రీకులు పరలోక జీవితంలో ఆత్మ మాత్రమే వుంటుంది, శరీరం వుండదు అనుకొన్నారు. పైగా మోక్షజీవితం మనకు అప్రయత్నంగాను సహజసిద్ధంగాను లభిస్తుంది అనుకొన్నారు. దీనికి భిన్నంగా పౌలు మోక్షజీవితం మనకు దేవుని దయవల్ల మాత్రమే లభిస్తుంది అని చెప్పాడు. పైగా పరలోక జీవితంలో మన దేహమూ ఆత్మ కలసివుంటాయని చెప్పాడు.

కాని మోక్షజీవితంలో వుండే దేహం ఈ లోకంలో వుండే దేహంకాదు. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని పొందలేవు -1 కొరి 15,50. మోక్షంలోగూడ మనం ఈ లోకంలో ఏవ్యక్తులమో ఆ వ్యక్తులంగానే వుంటాం. కాని మన దేహస్వభావం మాత్రం మారిపోతుంది. ఈలోకంలోని మన దీనశరీరాలు పరలోకంలో ఉత్థానక్రీస్తు దివ్యశరీరంలాగ మారిపోతాయి -ఫిలి 3.21 ఈ లోక జీవితానికి ఈ మర్త్యశరీరం సరిపోతుంది. పరలోక జీవితానికి దివ్యశరీరం కావాలి.