పుట:Paul History Book cropped.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
2.రెండవ రాకడ

ప్రభువు తన జీవితకాలంలో రెండవ పర్యాయం వేంచేయ డని పౌలు జీవితాంతంలో గూర్తించాడు -ఫిలి 1,23. కాని క్రీస్తు రెండవ పర్యాయం వచ్చినపుడు ఏంజరుగుతుంది? నరులంతా ఉత్థానమౌతారు. వారికి న్యాయనిర్ణయం జరుగుతుంది. ప్రస్తుత లోకం ముగుస్తుంది. క్రీసు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. తదనంతరం దేవుడే సమస్తాన్ని పరిపాలిస్తాడు - 1 కొరి 15,24-28. ఇక్కడ మనకు మూడంశాలు ముఖ్యం.

మొదటిది, దేవుడు క్రీస్తుద్వారా అందరికీ తీర్పుతీరుస్తాడు -రోమా 2,16. కాని క్రీస్తుని నమ్మినవాళ్లు ఖండనకు గురికారు. రెండవది,విశ్వాసులంతా మోక్షంలో కలసివుంటారు. క్రీస్తు తోడి సోదరుల్లో జ్యేషుడు ఔతాడు - రోమా 8,29. అంత్యకాలంలో ఒక్క నరులేగాక సృష్టి అంతా నూత్నత్వాన్ని పొందుతుంది -8,21. మూడవది, రెండవ రాకడ అంటే క్రీస్తు విజయమే. దానితో లోకంలోని దుష్టశక్తులన్నీ నశిస్తాయి. ఆలా నాశమయ్యే చివరి శత్రువు మృత్యువు -1 so 15,25–26.

3. సదా క్రీస్తుతో వుండిపోవడం

వెూక్షంలో వునం సదా క్రీనుతో వుండి పోతాం. ఉత్థానమయ్యేవారిలో క్రీస్తు ప్రథమఫలం. అతనిలాగే మనంకూడ ఉత్థాన మౌతాం. మనం క్రీస్తుకి తోడివారసులం - రోమా 8,17. మనం క్రీస్తుతోపాటు మరణిస్తే అతనితోపాటు జీవిస్తాం గదా! కనుక మనం సదా ప్రభువుతోనే వుండిపోతాం -1 తెస్స 4, 17. మోక్షంలో క్రీసుతో కలసి వుండడం, ఆ ప్రభువుతో కలసి జీవించడం మహాభాగ్యం. ఒక్క క్రీస్తుతో కలసి వుండడం మాత్రమేకాదు, మనం కూడ అతనిలాగే మారిపోతాం. దేవుని కుమారుని పోలికను పొందడమే నరులమైన మన ధ్యేయం - రోమా 8,29.