పుట:Paul History Book cropped.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరిగింది. అతడు నూత్ననరుడు అయ్యాడు. క్రీస్తు విరోధి క్రీస్తు భక్తుడుగా మారిపోయాడు. ఇక క్రీస్తుని అనుభవానికి తెచ్చుకోవడం, అతన్ని ఇతరులకు బోధించడం తనథ్యేయంగా పెట్టుకొన్నాడు. క్రీస్తే తన్ను అన్యజాతులకు ప్రేషితుణ్ణిగా నియమించాడని గట్టిగా నమ్మాడు.

ప్రేషిత సేవ

పరివర్తనం తర్వాత సౌలు మూడేండ్లపాటు డమస్కు ప్రక్కనేవున్న అరేబియాలో ఏకాంతంగా వుండిపోయి క్రీస్తుని ధ్యానం చేసికొన్నాడు-గల 1,17. పూర్వం మోషే యేలియా క్రీసులకు ఎడారిలో దైవసాక్షాత్కారం కలిగింది. అటుపిమ్మట డమస్కులో క్రీస్తుని బోధించడం మొదలు పెట్టాడు. కాని అక్కడి యూదులు పగబట్టి అతన్ని చంపబోయారు. అతడు శత్రువుల బారినుండి తప్పించుకుని యెరూషలేము చేరుకొన్నాడు. అక్కడ బర్నబా అతన్ని అపోస్తుల బృందానికి పరిచయం జేసాడు. రెండు వారాలు క్రీస్తుని బోధించాడో లేదో, అక్కడి యూదులు కూడ అతనిపై పగబూని చంపబోయూరు. సౌలు స్వీయనగరమైన తార్సుకి వెళ్లిపోయాడు. అక్కడ క్రీస్తు మరణోత్థానాలను లోతుగా ధ్యానం చేసికొని ప్రార్థనలో మునిగిపోయాడు. క్రీస్తుని బోధించడానికి తన్ను తాను సిద్ధం జేసికొన్నాడు. అతనికి పలుసార్లు క్రీస్తు దర్శనాలు కలిగాయి-2కొరి 12,1-7.

అంతియొకయలో గ్రీకు ప్రజలు క్రీస్తుని అంగీకరించి విశ్వాసులు అయ్యారు. బర్నబా వారికి బోధకుడయ్యాడు. అతడు 45లో సౌలుని తారు నుండి అంతియొకయకు తీసికొని వచ్చాడు. ఆ యిద్దరు అక్కడ కొంతకాలం పాటు క్రీస్తుని బోధించారు.