పుట:Paul History Book cropped.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. పౌలు జీవితమూ, రచనలూ

ఈ యధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దాం.
పౌలు జీవితం.
బాల్యం

పౌలు క్రీస్తు జన్మించిన తర్వాత కొద్ది యేండ్లకే పుట్టాడు. జన్మనగరం సిలీష్యా రాష్ట్రంలోని తారు. అతనికి సౌలు, పౌలు అని రెండు పేరు వుండేవి. అతడు పరిసయుల శాఖకూ, బెన్యామినాను తెగకూ చెందినవాడు. చిన్నప్పడే మోషే ధర్మశాస్రం, మిష్ణా అనబడే పూర్వుల సంప్రదాయం నేర్చుకొన్నాడు. తారు నగరం గ్రీకు సంస్కృతికి నిలయం. కనుక అతడు గ్రీకు భాషను క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు. స్టోయిక్, ఎపిక్యూరియన్ తాత్వికుల భావాలను అర్థంజేసికొన్నాడు. పెరిగి పెద్దయిన తర్వాత యెరూషలేములో గమలియేలు వద్ద ధర్మశాస్ర వివరణను అభ్యసించాడు. తర్వాత రబ్బయిఐ గుడారాల బట్ట నేయడం వృత్తిగా పెట్టుకొన్నాడు. అతనికి రోమను పౌరసత్వం వుంది.

పరివర్తనం

క్రైస్తవులు యూదమతానికి వ్యతిరేకులనీ, వారిని మొదటలోనే అణగద్రోక్కాలనీ నిర్ణయించుకొన్నాడు సౌలు. కనుక క్రైస్తవులను హింసించడానికి పూనుకొన్నాడు. వారి నాయకుల్లో ఒకడైన సైఫను హత్యలో చేతులు కలిపాడు. క్రీ.శ. 36లో డమస్కులోని క్రీస్తు భక్తులను హింసించడానికి వెళ్తుండగా సౌలుకి క్రీస్తు దర్శనం కలిగింది. దీనివల్ల అతని జీవితం క్రొత్త మలుపు