పుట:Paul History Book cropped.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటిది, అతడు యూద సంస్కృతిలో పుట్టి పెరిగినవాడు రెండవది, అతడు గ్రీకు సంస్కృతికి కూడ అలవాటు పడినవాడు.

1. యూదసంస్కృతి

పౌలు స్వచ్ఛమైన హెబ్రేయుడు. యూదమతాన్ని నిష్టతో పాటించే పరిసయుల శాఖలో పుట్టినవాడు - ఫిలి 3,5-6. యూద మతాన్ని పాటించడంలోను, పూర్వుల సంప్రదాయూలను అనుసరించడంలోను తోడియూదులను మించిన ఆసక్తి కలవాడు - గల 1,14. అతని జన్మస్థలం సిలీష్యాలోని తారునగరం. ఆనాడు ఆ పట్టణం యూద సంస్కృతికీ గ్రీకు నాగరకతకూ కూడ నిలయం. అతడు యెరూషలేములో ఆనాటి గొప్ప రబ్బంుయైున గమలియేలు వద్ద ధర్మశాస్త్రం చదువుకొన్నాడు-అచ22,3. ఆరోజుల్లో ఆ గురువుదగ్గర చదువుకొన్న శిష్యులకు ప్రత్యేకమైన హోదావుండేది. యెరూషలేములో పౌలుకి ఒక సోదరీ, మేనల్లుడూ వుండేవాళ్లు –23,16.

పౌలు హిబ్రూ అరమాయిక్ భాషలు తెలిసినవాడైనా గ్రీకు పూర్వవేదాన్నే ఎక్కువగా ఉపయోగించాడు. అతని రచనల్లో ఈ గ్రంథం నుండి 90 ఉదాహరణలు కన్పిస్తాయి. అతని ఆలోచనలకూ భావాలకూ గ్రీకు బైబులే పునాది. పూర్వవేదంమిచాద అతడు చెప్పే వ్యాఖ్యలు రబ్బయుల వ్యాఖ్యల వద్ధతిలో వుంటాయి. యూదమతం క్షుణ్ణంగా తెలిసినవాడు కావడం చేత భగవంతుడు యూదులను క్రైస్తవమతంలోకి రాబట్టడానికి అతన్ని సాధనంగా వాడుకొన్నాడు.

2. గ్రీకు సంస్కృతి

పౌలు జన్మించిన తారుస్తగరం గ్రీకుసంస్కృతికి నిలయం.