పుట:Paul History Book cropped.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వమానవాళికి రక్షకుణ్ణిగా ప్రకటించాడు. క్రీస్తుమరణోత్థానాల శక్తిని, ఉత్థాన క్రీస్తు తిరుసభను ప్రేరేపించే తీరునూ విశదం చేసాడు. పౌలునుండి నేడు వునం క్రీసు పట్ల భక్తి ఏలా చూపాలో నేర్చుకొంటాం. జ్ఞానస్నానం ద్వారా, సత్ర్పసాదం ద్వారా క్రీస్తుతో ఏలా ఐక్యంగావాలో తెలిసికొంటాం. రోజువారి జీవితంలో క్రీస్తునుండి ఏలా ప్రేరణం పొందాలో అర్థంజేసికొంటాం. క్రీస్తు మనలో ఏలా వసిస్తున్నాడో తెలిసికొంటాం. క్రీస్తుపట్లభక్తి అలవర్చుకోగోరేవాళ్ల కందరికీ పౌలు జాబులు దీపస్తంభంలాగ దారి జూపుతాయి.

3. పౌలు క్రీస్తు జీవితాన్ని బోధలనూ సమన్వయపరచి తొలినాటి క్రైస్తవ సమాజంలో కొన్ని ఆచరణ పద్ధతులూ, దైవార్చనా పద్ధతులూ ఏర్పాటు చేసి పోయాడు. ఇప్పటికీ వునం ఈ సంప్రదాయాలనే అనుసరిసున్నాం. అతడు నేర్పిపోయిన విశ్వాససత్యాలనుండి ఇప్పడు గూడ ప్రేరణం పొందుతూనేవున్నాం. కొందరు బైబులు పండితులు అతన్ని క్రైస్తవ మతానికి "రెండవ స్థాపకుడు" అని పిల్చారు. కనుక మన విశ్వాస జీవితంలో పౌలు ప్రాముఖ్యం అంతా యింతా కాదు.

4. పౌలు ప్రేషిత సేవ, వేదబోధ, క్రైస్తవ సమాజాలను నెలకొల్పి వాటిని వృద్ధిలోకి తీసికొని రావడం, శిష్యబృందంతో కలసి పనిచేయడం, వేదవ్యాపకంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడం మొదలైన అంశాలు ఇప్పడూ మనకు పేరణం పుట్టిస్తాయి. వేదబోధ కులందరికీ పౌలు ప్రేషితపద్ధతులు, పరిష్కారమార్గాలు ఇప్పడుకూడ మార్గదర్శకంగా వుంటాయి.

5. తన జాబుల రీత్యాగూడ పౌలు గొప్పవాడు. మొదట వ్రాసిన పవిత్రగ్రంథాలు సువిశేషాలు కాదు, పౌలు జాబులు. ఇప్పడు మనం నూత్నవేదంలో సువిశేషాలు మొదట వుండడం వల్ల అవే