పుట:Parama yaugi vilaasamu (1928).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

133


జగతి నెవ్వరు నీకు సరిలేరు నీకుఁ
దగునాతఁ డతనికిఁ దగుదువు నీవు
భాగ్యంబు చేసితి బంధుల యెదుట
యోగ్యుండ వైతి వీయుర్వి నెన్నంగ
వైదికుం డని జను ల్వర్ణించిచూడ
నీదు బ్రాహ్మణ్యంబు నేఁడు సిద్ధించె
యాగమంతయు సాంగ మయ్యె నౌరౌర !
నీగుణంబుల నెన్ననేర్తుమే యేము
అనుచు నొండొరు మోము లాగ్రహవృత్తిఁ
గనుఁగొని నిడువాలు గడ్డంబు లదర
జగడించి కెరలుచుఁ [1]జంకపుస్తములు
దిగజార వదలఁగట్టిన పంచె లూడఁ
దొట్టిపెంజెమటలు దొఱఁగ ఫాలముల
దట్టంపుఁ బట్టెవర్ధనములు గరఁగఁ
ప్రాఁకుబన్నులు వెలిఁబడఁగ బాహువులు
వీఁక మైఁ జాచియ వ్విప్రుఁదిట్టుచును
గడపట వీని సంగడి నింతనుండి
కుడువకుం డెవ్వఁడుఁ గుడిచినవాని
[2]బొంపిరి జన్నిదమ్ములు త్రెంపివైచి
పెంపెల్లఁ జెడఁగొంపఁ బెరికింపవలయు


  1. జంకలపుస్థు జంకలవుస్థు
  2. బంపిరి