పుట:Parama yaugi vilaasamu (1928).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

పరమయోగివిలాసము.

దినకరనిభులైన ద్విజులు ఋత్విజులు
గనుఁగొన నాగమోక్తప్రకారమున
రంగైనకనకపాత్రమున నమ్మౌని
పుంగవునకు నగ్రపూజఁ గావించెఁ
గావింప ఋత్విజుల్ గని కోప మెసఁగ
నావిష్ణుచరణు నందంద తిట్టుచును
సర్వశాస్త్రజ్ఞు లైచర్చింప వేద
పర్వతములవంటి బ్రాహణు లుండఁ
బేర్చి బృహస్పతి పెకలివచ్చినను
జర్చింపగల ఘనశాస్త్రు లుండంగ
నశ్వమేధాదిపర్యంతముల్ దెలిసి
శాశ్వతమతు లైన శ్రౌతులుండగను
మనమున భయ మింతమాని యీయున్న
[1]ఘనులనందఱ గట్టకడఁ బారవైచి
యెవ్వనినోతెచ్చి యితరులు తన్ను
నవ్వ నిందఱ నట్టనడుమనుబెట్టి
యగ్రజన్ముల కహ౯మగుచు శోభిల్లు
నగ్రపూజనమిచ్చు టది యెట్టులోరి!
[2]యోజమాలినవాజ వోరిపోవ్రాత్య
నీజన్నమంతయు నేఁడు ఫలించె


  1. గట్టకట
  2. మాలినవాఁడ