పుట:Parama yaugi vilaasamu (1928).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vii

కవులనందఱ నేదియోయొకవిధముగా హేళనముఁ జేయువాఁడను ప్రథ గల తెనాలిరామలింగకవియె యీతనిఁ బొగడె నను నీపద్య మొకటి లోకములో వ్యాపించియున్నది.

క. చిన్నన్న ద్విపద కెరఁగును
   బన్నుగఁ బెదతిరుమలయ్య పదమున కెరఁగు౯
   మిన్నంది మొరసె నరసిం
   గన్నకవిత్వంబు పద్యగద్య శ్రేణి౯.

పదలాలిత్యము, అర్థగాంభీర్యము, శబ్దాలంకారాదివిశేషములు నీతనికవిత్వమునఁ బ్రకాశించును. ఈతనిద్విపద రచనాచమత్కృతి పిమ్మటనుండిన ద్విపదకవులకు మార్గదర్శకమైనది. కవిత్వవిశేషము లీగ్రంథపాఠకులకే విశదమగునని విడచి, కవి తననుగూర్చి చెప్పుకొనినవిశేషముల “నష్టమహిషీకల్యాణము”నుండి దిజ్మాత్రముగ వ్రాయుచున్నాఁడను,

ద్వి. .......... కావ్యంబుఁ జెప్పి
     యెనలేని శ్రీవెంకటేశు మెప్పించి
     సకలంబు నెఱుఁగ నసాధారణాంక
     మకరకుండలము లిమ్మహిఁ గొన్నవాఁడ
     దినములోననె వేయి ద్విపద లింపొంద
     వినుతవర్ణనలతో విరచించువాఁడ
     గవిశిరఃకంప యోగ్యప్రతిద్విపద
     నవబిరుదాంకుండ.... .......