పుట:Parama yaugi vilaasamu (1928).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

నగరసామ్రాజ్య ముచ్చస్థితిలోనుండినపుడై యుండును. ఆతనికుమారుఁడగు మనకవికూడ విజయనగరప్రాంతముననె యుండియుండును. వేంకటపతిరాయలు చంద్రగిరి వేలూరు ప్రాంతములలో నధికారమును వహించినేకాని మండెముప్రాంతము నేలలేదు. కాన సర్వవిధములఁ గవి 1560 సం॥ర ప్రాంతపువానినిగాఁ దలపోయవలసియున్నది. విజయనగర రాజ్యవిచ్చిత్తిననుసరించి తద్రాజవంశజులతోఁబా టీకవివంశజులును “చంద్రగిరి" ప్రాంతములకుఁ జేరి తమకులదైవతమగు తిరుపతివేంకటేశుని సేవింపఁ దిరుపతిలో స్థిరపడి తమపెద్దలు రచించిన యమూల్యములగు గ్రంథజాలమును రాగిరేకులపై వ్రాసి శ్రీవేంకటేశ్వరాలయమున కర్పించిరి. అవి నేఁటికిని గలవు. వానికిఁ బ్రతులను తిరుపతిమహంతుగారు వ్రాయింపఁబోవుచున్నారను సంతసవార్త వినిపించుచున్నది.

గ్రంథవిశేషములు.

ఈగ్రంథము వైష్ణవభక్తాగ్రేసరులగు “పన్నిద్దతాళ్వారుల” చరిత్రమైయున్నది. “తిమ్మభూపాలుఁ" డను మఱియొకకవి పైయాళ్వారులచరిత్రమునె పరమయోగివిలాస మనుపేరుననె పద్యకావ్యముగా రచించెను. ఇద్దఱు నించుమిం చొకకాలపువారె. వీరిరువుర కవిత్వములలో నెవరికవిత్వము శ్రేష్ఠమైన దనుటలో నభిప్రాయభేదము కలదుగాని