Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాతృదేవుడగు శంకరుడు అప్పటికేమిన్నీమాటలాడక ఊరుకున్నాడు.

    పిమ్మట కొన్నాళ్లకు తల్లీ కొడుకు కలిసి తమ ఊరికి సమీపాన ఉన్న చూర్ణీ నదికి స్నానానికి వెళ్లారు.  స్నానం చేస్తూ ఉండగా శంకరుని కాలు మొసలి పట్టుకుని లోపలికి ఈదుస్తూ ఉంది.  అప్పుడు అదరిపాటుగా శంకరుడు తల్లితొ "అమ్మా! నాకాలు మొసలి పట్టుకుంది.  నాకు మరణం ఆసన్నమైనట్లె, సన్యాసినయిచస్తే మోక్షం వస్తుంది.  కాబట్టి అనుజ్ఞ ఇమ్ము" అన్నాడు  ఆపద్ధర్మంగా తల్లి అందుకు అంగీకరించింది.
   అప్పుడు శంకరుడు 'సన్యస్తంమయా ' అనిప్రేషోచ్చారణ చేశాడు. తోడనే మొసలి శంకరుని వదిలి పట్టి వేసింది.  శంకరుడు తల్లిని, పిత్రీయదనాన్ని జ్ఞాతులకు అప్పగింది ఆశ్రమ ధర్మవిరుద్ధమైనా తాను వచ్చి ఆమెకు అవసానదశలొ ఉధోక్తకర్మలు చేయడానికి వాగ్ధానం చేసి వెళ్లిపోయాడు.
  ఆ వెళ్ళడం అతడు నర్మదానదీ తీరాన ఉన్న వోవింద సాదుల వద్దకు వెళ్ళాడు.  అతడు శంకరునికి అద్తైత్ బ్రహ్మ తత్వాన్ని ఉపదేశింఛాడు.  ఒకనాడు గోవింద సాదులు సమాధి యందుండగా నర్మదానదికి వరదవచ్చి రెండు తటమ్లు ఒరసి పారుతూ ఉండెను.  నదీ ప్రవాహద్వని సమాధిస్తితుడైన గురువునకు భంగం కలుగకుండా శంకరుడు ఆనది నీటిని తన కమండలము నందు బంధించెను.
   సమాధి నుండి గురువు లేచి ఈ అద్భుత కృత్య విషయం తెలిసికొని శంకరుని చేరపిలచి "నదీ జలాన్ని అంతటిని కమండలములో ఇమిడ్చివేసినఆదు.  బ్రహ్మసూత్రములకు భాష్యము వ్రాయడానికి సమర్ధుడు అని పూర్వము వ్యాసులవారు సెలవిచ్చి ఉన్నారు.  ఆ మహిమ నీవు నెఱిపినావు.  కావున నీవు కాశీకి వెళ్లి విశ్వనాధుని అనుగ్రహం పొంది గ్రంధరచన చేయుము" అని చెప్పాడు.
  గురువు అనుమతి పొంది శంకరుడు కాశీకివెళ్లాడు.  చోళదేశంనుండి అప్పుడు సనందుడు అనే శిష్యుడు వచ్చి శంకరుని వద్ద చేరెను.  చిత్సుల్య్హుడు ఆనందగిరి మున్నగు వారు అతని ముఖ్యశిష్యులలో మఱికొందదు.
    మాధ్యాహ్నెకై ఒకనాడు శంకరుడు గంగానదికి వెళుతూ ఉన్నాడు.  తోవలో నాలుగు కుక్కలను తోలుకు వెళుతూ ఉన్న చండాలుడు ఒకడు అతనికి కనిపించాడు.  అప్పుడు శంకరుడు అతనితో తోవ తొలగి పొమ్మన్నాడు.  "నీవు తొలగి పొమ్మనేది దేహమునా! లెక చైతన్యమునా!