పుట:PandugaluParamardhalu.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆదంపతులు సంతానము కొఱకు అతి భక్తితో శంకరుని అర్చిస్తూ ఉండిరి. శంకరుని అనుగ్రహం వల్ల పుట్టడం చేత అతనికి శంకరుడు అని పేరు పెట్టేరు. శంకరుడు అనగా సుఖము కలిగించువాడు అని అర్ధము.

  శంకరుడు పిన్నట నాటనే తన ప్రతిభను ప్రదర్శింప సాగెను.  అతని తెలివి చూచి తల్లిదండ్రులు అతనికి ఐదవ ఏటనే ఉపనయనం చేయడానికి ప్రయత్న పడ్డారు.  ఇంతలో శివగురుడు మరణింఛాడు.  తల్లియే కష్టపడి కొడుక్కి ఉపనయనం చేసింది.
     తరువాత అతను గురుకుల వాసం చేశాడు.  ఆ చిరకాలంలోనే అతడు చతుర్వేదాలు, షడంగాలు, షడ్దర్శనాలు, చతుస్వష్టి ఇకళలు నేర్చాడు.
    విద్యార్ధిదశలో అతడు నెఱపిన అద్భుత మహిమ ఒకటి ఉంది.  వివ్యభ్యాసకాలంలో అతడు భిక్షాన్నం తెచ్చుకొని తింటూ ఉండేవాడు.  ఒకనాడు అతడు ఒక బ్రాహ్మణుడి ఇంటికి బిక్షాకబళానికి వెళ్లాడు.  ఆ బ్రాహ్మణుడు మిక్కిలి పేదవాడు.  ఆనాడు ఆయిల్లు అయ్యవార్లంగారి నట్టిల్లు లాగున ఉండెను.  ఆ స్థితిలో విద్యార్ధి శంకరుడు ఆ యింటికి మధుకర కబళానికి వెళ్లాడు.  అప్పుడు ఆయింటి యిల్లాలు 'నాయనా! మేము ఇప్పుడు కటిక దరిద్రులమై ఉన్నాము.  ఈనాడు నేను నీకు ఒక అన్నకబళమైనా పెట్టలేని స్థితిలో ఉన్నాము.  అని కన్నీటితో పలుకుతూ ఇల్లు నాలుగు మూలలా చూచి ఒక మూల దొరికిన ఒకే ఒక ఉసిరికాయ తెచ్చి శంకరుని జోలెలో ఆదరంతో ఉంచింది.  ఆమె అన్న మాటలకు, చూపిన ఆదరణకు శంకరుడి హృదయం కరుణ్యార్ధమయింది.  తోడనే భవ్య కవితావేశుడయి ఆతడు లలిత పద విలసితాలయిన వృత్తాలతో లక్ష్మీదేవిని స్తుతించాడు.  అప్పుడు లక్ష్మీదేవి ఆ యింటిలో బంగారపు ఉసిరి కాయలు కురిపించింది.  అతని అద్భుత మహిమకు అంతా ఆశ్చర్యపోయారు.  కనకం ధారగా కురవడానికి కారణభూతమైన ఆ శ్లోకాలకు 'కనకధారాస్తవం ' అనే పేరు వచ్చింది. 
    అప్పటికి అతనికి ఏడో ఏడు.  అన్ని విద్యలు పూర్తిగా చదివి అతడు ఇంటికి వచ్చాడు.  మాతృదేవిని అర్చిస్తూఉన్నాడు.  అతనిని ఒక యింటి వానిని చేయాలని తల్లి సంకల్పించింది.  కాని సన్యాసాశ్రమం స్వీకరించడం తన అభిమతమని అతడు చెప్పాడు.  నాయనా! నన్ను యింత బూడిద చేయకుండా నీవు సన్యాసివి అవుతావా! అని తల్లి కన్నీళ్లు కార్చింది.