పుట:PandugaluParamardhalu.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రౌచ్యుడు రుచి కుమారుడు. రుచిభార్య మాలిని. రుచికి పితృదేవతలు అతని కొడుకు మనువు కాగలడని చెప్పారు అట్లే రౌచ్యుడు మనువు అయ్యాడు. అతని కుమారులైన చిత్రసేనుడు, దృఢుడు, సరధుడు మొదలైన వారు రాజులు అయి పాలించారు.

    మన పంచాంగాలలో ఇది శైవచతుర్ధశిగా పేర్కొనబడింది.  శివునికి ఈనాడు సమనముతో పూజచేయాలని (శివేదమనకా రోప:) ఈనాడు శివసన్నిధి గల తీర్ధాలలో స్నానం చేయాలి అనీ పురుషార్ధ చింతామణి తిధిఉతత్వంలో ఇది మదన చతుర్ధశి.  మదన పూజోత్సవ నామాలతో పేర్కొనబడింది.  గదాధరపద్దతిలో దీని నామం దమనక చతుర్ధశి అని కలదు.
    ఈనాడు నృసింహ డోలోత్సవం చేస్తారని స్మృతి కౌస్తుభము మహోత్సవవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతున్నాయి.
                           చైత్ర పూర్ణిమ
   పున్నమి, పూర్ణిమ అను సంస్కృతశబ్దమునకు ఇద్ తద్భవము.  పూర్ణిమనే సంస్కృతంలో పౌర్ణమాసీ అనిన్నీ అంటారు.
                     పున్నములు రెండు రకాలు
    ఒకకళ చేత తక్కువైనవాడుగా చంద్రుడు ఉండే పున్నమి ఒకటి.  ఈ పున్నమి అనుమతి అనబడుతూ ఉంది.  పదారుకళలతో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పున్నమి మరి ఒకటి.  ఈపున్నమి రాకా పూర్ణిమ అనబడుతూ వుంది.
    సూర్యేందు సంగమకాలము అమావాస్య, అమావాస్య నుండి పూర్ణిమకు పదహారు రోజులు.  అమావాస్య నుంది పున్నమకును, పున్నమినుంది అమావాస్యవరకును గల కాలాన్ని పర్వసంధి కాలమంటారు.
     అమావాస్య నుండి పూర్ణిమాస్యవరకు గల పదహారుదినాలలో ఒక్కొక్క దినానికి చంద్రునికి ఒక్కొక్కకళ హెచ్చుతూ ఉంటుంది.  పూర్ణిమాస్య నుండి

అమావాస్యవరకు గల పదహారు దినాలలో ఒక్కొక్కదినానికి చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ ఉంటుంది.

  పదహారు కళలతో ఒప్పుతూ పూర్ణీమనాడు చంద్రుడు కాంతి ఇస్తంద్రుడై ఉంటాడు.  ఇట్లా చంద్రుడు కాంతి నిస్తంద్రుడై ప్రకా'శించేదినాలు