పుట:PandugaluParamardhalu.djvu/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్ని పండుగలు ఆయా ప్రదేశాల శీతోష్ణస్థితిగతుల్ని పట్టి ఏర్పడ్డాయి. కొన్ని ఆయాసామాజిక జీవన విధానంలోంచి పుట్టుకొచ్చాయి.

వ్రతాలు, నియమాలు ఇవన్నీ మానవుడికి ఒక సంస్కారాన్ని అలవరచాయి. ఆయా నియమాలు మానవులకు ఆరోగ్యప్రదాలుగా పరిణమించాయి. ఎన్నెన్నో వ్రతగ్రంధాలు వ్రాసిపెట్టారు ఋషికల్పులయిన మన పెద్దలు.

పండుగల సందర్భంలో ఆయా పండుగల గురించి మానాన్నగారు వ్యాసాలు వ్రాసి ప్రచురిస్తూ ఉండేవారు.

పండుగల గురించిన విషయాలన్నీ సేకరించి ఉంచారు. ఈపండుగలు మన సంస్కృతికి దర్పణాలు. వారు పరిశీలించిన గ్రంథాలు ప్రధానంగా - నీలమతపురాణం, స్మృతికౌస్తుభం, చతుర్వర్గ చింతామణి, గదాధర పద్ధతి, పురుషార్ధ చింతామణి, ధర్మసింధువు, నిర్ణయసింధువు, వ్రతోత్సవచంద్రిక, తిధితత్త్వము, స్మృతిదర్పణము, పురాణనామచంద్రిక, అమాదేర్ జ్యోతిషీ, హిందువుల పండుగలు - ఆయా పత్రికల్లోని వివిధ వ్యాసాలు కూడా.

ఇంతకృషి చేసి సేకరించిన విషయాన్ని క్రోడీకరించి ప్రచురించడం నాకనీస బాధ్యతగా భావించి ఈ పుస్తకానికి నా నేర్చువిధంబుగా ఒక రూపాన్ని ఇచ్చి అచ్చు వేయడం జరిగింది.

తెలుగు వారి ఈ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాల వారికి అందించాలనే తపనే ఈ పుస్తకం ముద్రించడానికి కారణం.

తక్కిన నాలుగు ఋతువులలోని పండుగల వివరాలు త్వరలో ముద్రించాలని ఆకాంక్ష.


మలయవాసిని