పుట:PandugaluParamardhalu.djvu/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహుముఖప్రజ్ఞానిధి

స్వగృహీతనామధేయులు ఆండ్ర శేషగిరిరావుగారు సుప్రసిద్ధ వయోవృద్ధులు. జ్ఞానవృద్ధులు. జన్మస్థలము పశ్చిమ గోదావరి తణుకుతాలూకాలోని ముక్కాముల. వాసస్థలము విశాఖపట్టణ జన్మదినము శోభకృన్నామ సంవత్సర భాధ్రబహుళ విదియ గురువారము 10-9-1903 వ తేదీ విద్యారంగ రాజమహేంద్రవరము. ఆంధ్రవిశ్వకలాపరిషత్ తొలిజట్టు పట్టభద్రులు. సంస్కృతాంధ్రసాహిత్యవేత్తలు. ఆయుర్వేద వైద్యవిశారదులు. పత్రికాసంపాదకులు. ప్రముఖ గ్రంథకర్త ప్రసిద్ధవ్యాసకర్తలు. కాకినాడ కాంగ్రెస్ మహాసభలలో కరపత్రములుగా పంచిపెట్టిన భారతిలో వ్యాసకర్తలు. (1923) రాజమహేంద్రవర సారస్వత సమాజమును స్థాపించిన సాహిత్యారాధకులు (1922).

గృహలక్ష్మి (1929-32), ప్రజామిత్ర (1938-42), ఆనందవాణి (1945-?), ఆంధ్రవాణి (1952), వేదిక (1970-71), పత్రికల సహసంపాదకులు.

ఆంధ్రభూమి (1933-42), ఆరోగ్యసుధ (1948-52), ఆంధ్రకీర్తి (1978-81) పత్రిక స్వయం సంపాదకులు.

వీరి గ్రంథములు త్రివిధము, ఆంధ్రుల కీర్తిచంద్రికలు అచ్చొత్తు ఆహారవిజ్ఞానమును అందించునవి. ఆరోగ్యవిజ్ఞానమును అందిచ్చునవి.

ఆంధ్రరమణీమణులు మొదటి భాగము 1931, రెండవ భాగము 1933, మూడవ భాగము 1993, ఆంధ్రరాజభక్తులు 1946-51, (అయిదేండ్లలో ఏడు ముద్రణలు), ఆంధ్రవిదుషీమణులు మొదటి భాగము 1950, మొత్తము 1995, ఆంధ్రసారస్వత వ్యాసావళి 19, ఆంధ్రవిరయువకులు 1954, హైదరాబాదుచరిత్ర 1956, ఆంధ్రకవుల అద్భుత మహి కథలు 1981, ఆంధ్రబాలల వికటకవితావినోదిని 1982, (ఆంధ్రరాజభక్తులు బరంపురం విశ్వవిద్యాలయము వారి ప్లస్|| పరీక్షకు, ఆంధ్రరమణీమణులు మూడవ భాగము ఆంధ్రవిశ్వకళాపరిషత్ మెట్రిక్యులేషన్ కు పాఠ్యగ్రంథములైనవి.)

ఆకుకూరలు 1947, కాయకూరలు 1947, దుంపకూరలు 1947, తేనె 19--, ఆవుపాలు 1949, వేసవి 1949, చనుపాలు 1950, వెన్న-నేయి 1950. ఫలజాతులు మొదటి భాగము 1951, దంతరక్షణ 1951, నిద్ర 1951, విటమినులు 1951, ఖనిజలవణాలు 19--, శిరోజరక్షణ 1951, చర్మరక్షణ 1951, ఫలజాతులు రెండవ భాగము 1952.

వీరి వ్యాసములు బహువిధములు. చారిత్రకములు, సాహిత్యవరము హాస్యప్రధానములు, విజ్ఞానప్రదములు, ప్రముఖుల పరిచయములు, స్థల విశేషములు, పండు పరమార్థములు మొదలైనవి. మొత్తము త్రిశతాధికము 315.

తెలుగు సరస్వతికి వీరి తిక్కన కవ్వులు కస్తూరీతిలకము. మహారాష్ట్రపాలక వాజ్మయ సేవ (1950) కర్పూర నీరాజనము.

21-7-95 - ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి