పుట:PandugaluParamardhalu.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంతానం పడసి తమకు ఉద్దతి కలిగించమని చెబుతారు. అందుమీద రుచి బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మప్రత్యక్షమై నీ పితరులు చెప్పినట్లు వివాహం చేసుకోమంటాడు. అటు పిమ్మట రుచి నదీ తీరాన పితృతర్పణం చేస్తాడు. పితృదేవతలు వచ్చి 'బిడ్దా '! నీకు ఒక మంచి యిల్లాలు లభించగలదు. ఆమె వలన నీకు మన్వంతరాధిపతిఅగు మనువు పుట్ట గలడు. అతడు రౌచ్యుడు అనే పేరుతో వ్యవహరింపబడును. అని చెప్పాడు.

    ఇంతలో నది మధ్యలో నుండి మనోహరిణి అయిన ప్రమ్లోచ అనే అప్సరస వెడలి వస్తుంది.  ఆమె రుచితో ఇట్లా చెబుతుంది.  అయ్యా! వరుణ పుత్రుడైన పుష్కరుని వలన నేను ఒక కన్యను పడసి ఉన్నాను. ఆమె జగదేక సుందరి.  ఆమె పేరు మాలిని.  ఆమెను నీకిచ్చి పెళ్లిచేయాలని నాకు అభిలాషగా ఉంది.
    రుచి మహర్షి మాలినిని వివాహ మవుతాడు. మాలిని యందు రుచికి ఒక కొడుకు పుడతాడు.  అతడు రేచ్చుడనే పేరుతో త్రయోదశ తమ మన్వంతరాధి సత్యము వహించును.
   ఈ మన్వంతరమున దివస్పతి నామకుడు ఇంద్రుడు.  ధృతిమంతుడు. తత్త్యదర్శి మున్నగువారు సప్తర్షులు.
                 ఆషాఢ బహుళ ఏకాదశి
  కామికైకాదశి
  ఆమాధేర్ జ్యోతిషీ అనె గ్రంధం ఈ ఏకాదశిని కామదైకాదశి అని పేర్కొంటూ ఉంది.
   ఈనాటి ఏకాదశీ వ్రతాచరణం వల్ల అభీష్ల్టములు ఈడేఱుతాయి.
                      ఆషాడ కృష్ణ అమావాస్య
                                     దీపపూజ
   ఇంటిలో వున్న ఇత్తడి దీప స్తంభాలు, కుందెలు అన్నీ శుభ్రంగా కడుగుతారు.  కొయ్యపలకల్ని పేడతో అలికి దానిమీద ముగ్గులు పెడతారు.  కుందెలు, దీపస్తంభాలు ఆ పలకల మీద వుంచుతారు.  స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. లడ్దూలు, మోరుండలు నైవేద్యం పెడతారు.  బ్రాహ్మడికి, ముత్తైతుదువుకి పెట్టుకుంటారు.  సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు.