పుట:PandugaluParamardhalu.djvu/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇట్టి ఉత్తమ శ్లోకునిచే స్థాపింపబడిన విద్యానగరం, విద్యానగర సామ్రాజ్యం రెండు వందల ముప్పయి సంవత్సరాలు మాత్రమే మనుటకు హేతువు ఏమిటనే జిజ్ఞాస ఈ సందర్భంలో కలగక మానదు. ఆ సందర్భంలో ఒక ఉదంతం చెప్పంబడుతూ ఉంది. విద్యానగర నిర్మాణానికి అతడు ఒక ముహూర్తాన్ని ఉంచాడు. ఆ ముహూర్తసమయానికి సరిగ్గా తాను గంటకొడతానని, అప్పుడు నగ్ర నిర్మాణానికి గుణావర్ధనం చేయమనీ చెప్పాడు. ఆ సంగరిని విన్న ఒకదు ముహుర్తానికి అరగంట ముందుగానే గంటకొట్టినాడు. నగరనిర్మాణం అప్పుడే ఆరంభమయింది. విద్యారణ్యుడిది తెలిసికొన్నాడు. నగర నిర్మాణం ఆరంభింపబడిన ముహూర్తాన్ని పట్టి దాని ఆయుర్ధాయం రెండువందల ముప్పయి సంవత్సరాలు మాత్రమే అని అతడు అప్పుడే చెప్పెవేశాడు. 133లో నిర్మితమైన ఆనగరం 1565లో మహమ్మదీయులదొద్దకు గురిఅయి పచ్చము పాడైంది.

   శతాదిఅ సంవత్సరాలు జీవించినవాడు, శరాధిఅక్ గ్రంధాలు వ్రాసినవాడు అయిన విద్యారణ్యస్వామి స్మృతి చిహ్నాలు శృంగేరీలోనూ, విద్యానగరంలోనూ కూడా ఉన్నాయి.  విద్యానగరాన విరూపాక్షస్వామి ఆలయానికి వెనకతట్టున విద్యారణ్యస్వామి మందిరం ఉంది.  శృంగేరిలో విద్యారణ్యస్వామి పూజకు ప్రత్యేకం ఒక ఆలయం ఉంది.  ఆ ప్రాంతాన విద్యారణ్య పురమనే అగ్రహారం కూడా ఉంది.
  జానిని ఉత్తేజపరచిన మహనీయులలో విద్యారణ్యుడు ఒకదు ఏడారికి ఒకనాడైనా అతనిని ఆరాధించడము మన విధాయక కృత్యం.  అతడు బ్రహ్మైక్యం పొందిన జ్యేష్టశుద్ధ త్రయోదశిని శృంగేరిపీఠంలో వలనె ప్రతి హిందూ దేవాలయంలోనూ అతని స్మరణ, పూజసాగవలసి ఉంది.
                      జ్యేష్ఠశుక్ల చతుర్ధశి
   చంపక చతుర్ధశి అని ఆమాదేర్ జ్యోతిషీ చెబుతున్నది.  ఈనాడు వాయువ్రతం చేస్తారని చరుర్వర్గ చింతామణి, రుద్రవ్రతం చేస్తారని స్మృతి కౌస్తుభము చెబుతున్నాయి.
                            జ్యేష్ఠ పూర్ణీమ
    మనపంచాంగంలో జ్యేష్ఠపూర్ణిమ నాటి వివరాల్లో 'వృషభ పూజా, హల ప్రవాహ: ' మున్నగు పదాలు ఉంటాయి.  ఎద్దులను పూజించుడం, నాగలి సాగించడం ఆనాటి విధి కృత్యాలని ఇందుతో తేలుతూ ఉంది.