పుట:PandugaluParamardhalu.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శృంగేరికామకోటిపీఠము అధిష్ఠించువరలందు గొందరికి 'విద్య ' పదముతోడ బ్రారంభమైన యోగపట్టము లున్నటుల మనకు కన్పట్ట్లుచున్నవి. విద్యాజ్ఞానేంద్ర, విద్యాఘన, విద్యఘనేంద్ర, విద్యాతీర్ద, రెండవపదము 'అరణ్య ' అరణ్యపదము పై నుదహరింపబడిన దశవిధనామము లందొకడు.పైవిషయములవెల్ల బరిశీలించిచూడ తురీయాశ్రమస్వీకరణానంతరము శృంగేరీ పీఠాధిష్ఠితుడైన మాదవాచార్యునకు కలిగిన 'విద్యారణ్య ' యోగపట్టము శృంగేరి జగద్గురుపీఠపు నియమముల ననుసరించి గొనినదియే. తురీయాశ్రమస్వీకరణమున బ్రహ్మచర్య గృహస్థవానప్రస్ధము లందు వ్యవహరించిననామము విడిచి నూతననామము ధరింపవలయునను నియమ మున్నటుల స్మృతౌలు సైతమంగీగరించుచున్నది. కాన విద్యాతీర్ధుల యంతేవాసియగు మాధవాచార్యుడు సన్యాసాశ్రమమున బవేశించి విద్యారణ్యయ్హోగపట్టము బడసి తత్పీఠాధిష్ఠితు డయ్యెనని సుస్పష్టముగ గోచరించుచున్నది." - సాహిత్య సరస్వతి శ్రీరాచర్లతిప్పయ్య.

    అతడు పద్నాలుగు వందల గ్రంధాలు రచించినట్లు చెబుతారు.  వేదభాష్య రచనలో అతనికి అతని సోదరుడగు సాయణుడు మాత్రమేకాక నారాయణ వాజపేయయాజి, నరహరి సోమయాజి, పాండరీదీక్షిత పెద్దవిద్యావల్లభ, మంత్రసిద్ధి మున్నగు ఇరవై నలుగురు పండిత ప్రకాండులు తోడుపడినట్లు తెలుస్తూ ఉంది.
                                 గురుభక్తి
   విద్యారణ్యుల గురుపాదులు విద్యాతీర్ధులు విద్యాతీర్ధులు లంబికాయోగ సిద్ధులు. ఒకనాడాయన శిష్యులను బిలిచి తాము లంబికాయోగమందు ప్రవేశించుచున్నాననియు, తనను సజీవునిగా సమాధిచేసి పండ్రెండేళ్ళవరకు సమాధిని కదుపవలదనియు శాసించిరట.  అట్లేచేసిన శిష్యులు గడువుదాటక ముందుగనే ఒకనాడు త్రవ్విచూడ అందుగురుఇ దేహమం దేవియో మార్పులు కనుపట్ట వారుభయపది దానిని యధాతధముగనుంచి వేసిరి.
     అనంతరము విద్యాతీర్ధులు విద్యారణ్య స్వామికి స్వప్నములో సాక్షాత్కరించి తన సమాధిపై ఒక మందిగము గట్టింపుమని యాజ్ఞాపింప విదెయారణ్యులు గురుదేవుని అభీంతానుసారము మందిరము నిర్మించి దానికి 'విద్యాశంకర" మందిరమని నామకరణము చేసిరి.
   ఆ మందిర ముఖమండపము చుట్టునున్న పన్నెండు స్తంభములు