ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఆసమయంలో బ్రాహ్మడు ఒకదు కాశీనుంచి లింగాన్ని ఒకదానిని తెచ్చేడు.
పుదుక్కోట ప్రభువు ఆలయం కట్టించాడు. లింగ ప్రతిష్టజరిగింది. సమాది మీద బిల్వ వృక్షాన్ని పాతేరు. ఇప్పటికిన్నీ వెరూరులో పుదుక్కోటలో జ్యేష్టశుద్ధ దశమినాడు ఉత్తరాదిని పండితరాయల పూజ. దక్షిణాదిని సదాశివయతి పూజ. ఇద్దరు తెలుగులను పూజ్యలింగములుగా చేస్తూ ఉన్న పుణ్యదినమది.
జ్యేష్టశుద్ధ ఏకాదశి నిర్జలైకాదశి జ్యేష్టశుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు గంగోత్సవాలు జరుగుతాయి. జ్యేష్టమాసంలో ఎండలు మెండుగా ఉంటాయి. భూమిలో నీటి మట్టం చాలా అడుగుకు పోతుంది. అట్టి గడ్దు వేసనిలో ఈ ఏకాదశినాదు పచ్చి మచి నీళ్లయినా పుచ్చుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుచేతనే దీనికి నిర్జలైకాదశి అని పేరు వచ్చింది.
ఈ విర్జలైకాదశి ఆదిలో భీముని వల్ల ఏర్పడినట్లు పురాణగాధ ఉంది.
భీముడు తిండిపోతు. ఒక పూట కూడ తిండి లేకుండా ఉండలేదు. అందుచేత దశమినా?దు ఏకభుక్తం మాత్రంచేసి ఏకాదశినాదు ఒక పూట అయినా భోజనం లేకుండా అతడు ఉందలేదు. అతడు వ్యాసుల వారితో సంప్రదించాదు. అప్పుడు వ్యాసుడు అతనితో 'నీవు జ్యేష్ఠశుద్ధ ఏకాదశిని నీళ్లుగాని, అన్నంకాని తినకుండా ఉండు. ఏడాదిలోని ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలను చేసిన ఫలితం నీకు సమకూరుతుంది. అని చెప్పాడు. బీముడు అట్లే చేశాడు. ఏడాదికి ఒక వ్రతాన్ని చేసి భీముడు ఏడాదిలో వచ్చేఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు ఫలితాలను పొందాడు. ఆఏకాదశి అంత మహత్తు కలది. ఆ ఏకాదశిని గురించి స్మృతి కౌస్తుభము, చతుర్వర్గ చింతామణి మున్నగు గ్రంధాలలో విపులంగా కలదు. జ్యేష్ట శుద్ద ద్వాదశి ఈనాడు చంపక ద్వాదశి పర్వమని గదాధర పద్దతి, త్రివిక్రమపూజ అని స్మృతి కౌస్తుభం.
దీనిని రామలక్షణ ద్వాదశి అంటారు. ఈనాదు కూర్మజయంతి అని కొన్ని వ్రత గ్రంధాలు పేర్కొన్నాయి. శ్రీశంకరాచార్యకైలాసగమనం ఈ రోజే.