Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గంగవతారం ఈనాడు జరిగించని స్మృతికౌస్తుభం చెబుతూ ఉంది. వ్రత్రోత్సవచంద్రికాకారుడు జ్యేష్టశుక్ల దశమి బుధవారం హస్తానక్షత్రం కాలంలో గంగావతారణం అయిందనీ, ఈ విషయాన్ని వాల్మీకి రామాయణం చెబుతూ ఉందనిఈ అంటున్నారు.

   జ్యేష్టశుక్లదశమి సౌమ్యవారంలో హస్తా నక్షత్రంలో కలిసివచ్చినవాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వపాపాలు సమసి పోతాయని నమ్మిక.
  వైశాంఅమాస శుక్ల సప్తమి నాడు గంగావతారణం జరిగినట్లు గ్రంధాతరాల్లో ఉంది.  గంగవతరణకు ఇది మరి ఒక తిధి.  ఇది ఎట్లు పొసుగుబాటు అగునో! ఈ దినము గంగావతరణం దినమైనాకాక పోయినా ఈ పర్వం గంగానదిని ఉద్దేశించి చేయబడేది కావడం కాదనరానిది.
    జ్యేష్ట?శుద్దదశమి వ్రతవిధానం స్కంద పురాణంలో ఉంది. జ్యేష్ట శుక్ల దశమి కొందరికి సంవత్సరాది అట.   ఆనాడు స్నానము, దానము, ముఖ్యము.  పాడ్యమి మొదలు దశమి వరకు స్నానం చేయడం కూడా ఈపర్వ నిధులలోదే.
    గంగాదేవి కృపను సంపాదించడం ఈ పర్వప్రధానోద్దేశంగా కనిపిస్తూఉంది.   ఈ ఉత్సవాన్ని గంగోత్సవమని కూడా అంటారు.  గంగానది నీరు అతిఫవిత్రమైంది.   ఎన్నాళ్లు నిలవ ఉన్నా చెడిపోదు.  గంగా తీరప్రదేశాలు అనేకం తీర్ధస్థలాలై ఉన్నాయి. ఈ పర్వం నదీతార గ్రామాల్లో విస్తరించి జదుగుతుందనవచ్చు.  కాశీ, హరిద్వారము, నాశిక్, మధుర, ప్రయాగ మొదలైన నదీ తీరనగరాల్లో ఈ పండుక బాగ ఆచరిస్తారు.  ఈప్రదేశాల్లో అక్కడక్కడ గంగాదేవి ఆలయాలు ఉన్నాయి.  అక్కడ గంగపూజ జరుగుతుంది.
  
     ఈనాడు గంగాస్నానం చేసి గంగాదేవిని పూజించి గంగా స్తోత్రం పఠిస్తేదశవిధ పాపాలు పోతాయి అని వ్రతగ్రంధం, షోడశోపచార విధిచే గంగ పూజ, గంగాదేవి పూజా మంత్రము.

     నమోభగవత్తై దశపాపహరాయై
    గంగానయై నారాయాణ్యై
    రేపత్యై దక్షాయై శివాయై
    అమృతాయై విశ్వరూప్పిణ్య్హై
    నందిన్త్వై తేనమోధమ!
    ఓం నమశ్శివాయై నారాయణ్ల్యై