పుట:PandugaluParamardhalu.djvu/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దశగరాయై గంగాయై నమోనమ:

          అని ఈ వ్రతకాలాన గంగాదేవిని పైన చెప్పిన జపనీయ మూల మంత్రాన్ని అహో రాత్రాలు అయిదు వేలసారులు జపించి వ్రతం పూర్తి చేయాలి.
      ఈ గంగోత్సవదశమికి మరోపేదు దశపాపహరదశమి అని. దశపాపహర దశమిని దశహరదశమి అనడం కూడా కద్దు.  దీనికి శాస్త్రప్రమాణం.

    శ్లో: లింగం దశాశ్వమేధేశం
        దృష్ట్యా దశహరాతిధౌ
        దశజన్యార్జితై: పాపై:
        త్యజ్యతే నాత్రసంశయ:

   దశహర తిధినాడు దశాశ్వమేధ ఘట్టంలోని లింగమును చూచినట్టయితే లోగడ పది జన్మలలో చేసిన పాపం నిస్సందేహముగా నశించి పోతుంది అని తాత్పర్యం.
    ఈనాటి స్నాన సంకల్పంలో కూడా ఇదే ధోరణి మాటలు: "మమ ఏతజ్జన్న జన్మాంతర సముద్బూత దశవిధపాపక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం దశహర మహాపర్వనిమిత్తం స్నానముహం కరిష్యే" జన్మజన్మంతరాల నుండి వచిన పది విధాలైన పాపాలు పోగొట్టే స్నానమని కదా దీని భావము.
   పర్వతిధి దశమి, ఆపర్వం పదిపాపాలను పోగొట్టేది.  కాగా ఈనాటి పూజ పదిరకాల పూవులతోననీ, ఈనాటి నైవేధ్యం పది రకాలపళ్లతో ననీ చెబుతారు.
      "Daughtyers of Malwa" అనే పుస్తకంలో మాల్వాదేశంలో ఈ పండుగ జరపబడే తీరు ఇట్లు వివరింపబడి ఉంది.
    "జ్యేష్ట శుక్ల పాడ్యమి మొదలు దశమి వరకు ప్రతిరోజున స్త్రీలు పిండి వంటలు చేస్తారు.  ప్రతిరోజు పదేసి భక్ష్యాలు దక్షణయుక్తంగా గురువులకు ఇస్తారు.  పదకొండోనాడు అనగా ఏకాదశినాదు ఉపవాసం ఉంటారు.  ఆ ఉపవాసకాలంలో పచ్చి మంచి నీళ్లు కూడా తాగకూడదు.  అదే నిర్జలైకాసశి."
    దశపాపహరదశమి వ్రత విధానమిది.  ఈవ్రతోద్యాపన సందర్భంలో చెప్పబడే కధ తెలుగు వారికి గర్వకారణమైంది.