పుట:PandugaluParamardhalu.djvu/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుర్వాసుని తనగాన చమత్కారముతో లోబఱచుకొన్నది గానవిధ్యలో గొప్పది అనెను.

    నారదుడు కడచిన కల్పమున ఉపబర్హణుడు అను గంధర్వడుగా ఉండినాడు.  అతడు నారాయణ కధలు గానము చేయువాడు.  తరువాతి కల్పమున బ్రహ్మమానసపుత్రుడయినాడు అని ప్రార్ధివకల్పము.
                    వైశాఖ బహుళ ఏకాదశి అపరైకాదశి
    ఆమాదేర్ జ్యోతిషీ గ్రంధం ఈ ఏకాదశిని అపరైకాదశి అంటూ ఉంది.  ఈనాడు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉంటే పవిత్ర తీర్దాల్లో స్నానం చేసిన ఫలం, పలురకముల దానం చేసిన ఫలం కలుగుతుందని చెప్పబడుతూ ఉంది.
            వైశాఖ బహుళ చతుర్ధశి  శివరాత్రి, సావిత్రీ వ్రతమ్
    ఈనాడు ఉపవసించి ప్రదోషకాలంలో స్నానంచేసి, తెల్లని వస్త్రాలు ధరించి, గంధం మొదలగు ఉపచారాలతో, మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాలి.
   లింగ వ్రతము ఈనాడు పిందితో శివలింగమును తయారు చేసి పంచామృతాలతో స్నానం చేయించి కుంకుమ పూసి ధూప, దీప నైవేద్యాలతోపూజ.
              వైశాఖ బహుళ అమావాస్య
      వైశాఖ బహుళ అమావాస్య గురువారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదం అంటారు.
    ఈనాదు ప్రయాగలో స్నానం పాపహరంగా ఉంటుంది.  త్రయోదశినాడు ఆరంభించి ఈనాటితో సావిత్రీ వ్రతం పూర్తి చేస్తారని పురుషార్ధ చింతామణి.
    పితరులను పూజించుట-పార్వణవిధితో శ్రాద్ధము దానము ఈనాటి విధులు.
                   వృషభ సంక్రాంతి
    ఈనాడు కృష్ణపూజ చేయాలనీ, ఉపవాసం ఉండాలనిఈ హేమాద్రి చెబుతున్నాడు.
   ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి