పుట:PandugaluParamardhalu.djvu/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ సున్నము వేయుటకు కారణము పూర్వము రోహిల్లాలు ఈ దేశమునకు వచ్చి హిందూ దేవాలయ చిత్రములను ద్వంసము చేయుచుండ పూర్వులు ఆ వార్త తెలిసి చిత్రేములను భిన్నము చేయుదురను భయముచే సున్నము వేసిరని కొందరును, పక్షులు చిత్రమునకును, చిత్రమునకు సందువరెట్టవేయ మొక్కలు లేచి మందడి పాడగునని కొందరును చెప్పుదురు.

   శ్రీకూర్మనాధుని కుశలవులు సేవించినట్టు.  తీర్ద యాత్రలో బలరాముడు దర్శించినట్లును వాడుకయున్నది.
    క్షేత్రములకాది కూర్మక్షేత్రమని వాడుక.
    శ్రీ రామానుజాచార్యుల వారు ఇచ్చటక్కు వచ్చి వైష్ణవ స్థలముగా నిరూపించి వారి దేవతార్చన శ్రీ గోవిందరాజు స్వామి శ్రీదేవి, భూదేవి వీరిని ఇచ్చట విత్యోత్సవులుగా ఉంపించి సింహాచలమునకు వెళ్లిరని ఆచార్య సూక్తి ముక్తావళి మొదలగు గ్రంధములు చెప్పుచున్నవి.
     ఇతటి శిలాశాసనములలో ఒక దాని యందు సర్వప్ప అప్పారాయనింగారి కాలమున శ్రీ కూర్మం గ్రామము శ్రీ కూర్మనాధునిసకల కైంకత్యమునకును, పరివారమునకును, రామానుజ కూటమునకు అన్ని వృత్తులతో ఏర్పాటుగా వ్రాయబడి ఉన్నది.  శ్రీ కూర్మం గ్రామము శ్రీ కూర్మానాధునికి సమర్పించినట్లు ఆస్థాన మంటపములో కుడివైపు స్తంభము మీద పలక యందు చెక్కబడియున్నది.  (ఉత్తరాంధ్రలో శ్రీ భాష్యం వెంకటా చార్యులు)
                             వైశాఖ బహుళ పాడ్యమి
      ఈనాడు 'భూతమాత్రుత్సవ ' అని చతుర్వర్గ చింతామణి, ఆగ్రంధంలోనేనాడు మొదలు జ్యేష్ఠ పూర్ణిమాంతం శ్రీ ప్రాప్తి వ్రతం చెయ్యాలని చెబుతూ ఉంది.
                 వైశాఖ బహుళ విదియ  నారదజయంతి
  ఈనాడు నారద జయంతి.  ఈనాడు వీణాదానము చేయాలని మత గ్రంధాలలో కలదు.  నారదుడు గాన విద్యా కుశలుడు.  అతని వీణకు మహతి అని పేరు.  ఆ వీణపై సదా విష్ణుగానము చేస్తూత్రిలోకాలలో సంచరిస్తూ ఉంటాడు నారదుదు.
     ఒకేసారి ఇంద్రసభలో రంభాదులతో గానములో గొప్పవారు ఎవరో తేల్చవలసినదని ఇంద్రుడు నారదుని కోరెను.  అట్టి నిర్ణయం చేయడానికి నారదుడే సమర్ధుడనెను.  నారదుడు అటూ ఇటూ తేల్చక చమత్కారముగ