ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రదక్షిణం చేస్తారు. ఆమీద కుండల్లో నీరు వృక్షం మొదట్లో పోస్తారు. దీపాలు వెలిగిస్తారు. చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించు 'వట సావిత్రి ' మున్నగు వ్రతాలు ఈ బౌద్ధ పర్వం ఛాయనే అని అంటారు.
శతజయంతి
వైశాఖ శుద్ధ చతుర్ధశినాదు విష్ణువు నరసింహావతారము ఎత్తాడు.
హిరణ్యకసిపుని కోసమే ఆ అవతారము. కాని హిరణ్యకశిపుని సంహరించిన తరువాత కూడా నరసింహమూర్తికి ఉగ్రము తగ్గలేదు. అప్పటి అతని రౌద్రము చూచి అందరూ భయపడ్డారు. తుదకు లక్ష్మీదేవి కూడ ఆ రౌద్రాన్ని తగ్గించలేకపోయింది. అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్ధించారు. అతడు శరభావతారం ఎత్తాడు. వైశాఖ పూర్ణిమ నాడు శివుడు శరభావతారాన్ని ఎత్తాడు. కాబట్టి ఆనాడు శరభజయంతి, శరభం ఎనిమిది కాళ్ల జంతువు. అది సింహాన్న చంప గలిగే శక్తి కలది. ఆశరభము ఆ సింహాన్ని చంప్ వేసింది. శరభరూపాన శివుడు నరసింహమును చంపీఆ చర్మమునుఇ ఒలిచి కప్పుకున్నాడు.
కూర్మజయంతి
వైశాఖ శుద్ధ పూర్ణీమనాడు కూర్మజయంతి అని ఆమాదేర్ జోతిషీ అనే గ్రంధం చెబుతోంది.
పుష్య శుక్ల ద్వాదశి నాడు కూర్మద్వాదశీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతూ ఉంది.
కూర్మవతారము విష్ణువు యొక్క దశావతారాలలో రెండోది.
దేవతలును, రాక్షసులును పూర్వము అమృతము కోసము ప్రయత్నిం చేసినారు. పాలసముద్రాన్ని మధిస్తే అమృతము వస్తుందని వారు తెలుసుకొన్నారు. అప్పుడు వారు మందర పర్వతాన్ని కవ్వముగానూ, వాసుకి అనే నాగరాజున్ కవ్వపుతాడుగానూ చేసి సముద్రమధనానికి ప్ర్రారంభం చేశారు. కవ్వపుతాడును ఒకకొన దేవతలు పట్టుకున్నారు. రెండవ కొన రాక్షసులు పట్తుకున్నారు. చిలకడం ప్రారంభమైంది. భారానికి మదరపర్వతం క్రిందికి దిగిపోతూ వచ్చింది. వాళ్లకు ఏమెచేయడానికి తోచిందికాదు. భగవంతుని ప్రార్ధించారు. అప్పుడ్ విష్ణువు పెద్దతాబేలు రూపాన్ని ధరించాడు. మందరగిరిని తన వీపుమీద మోచి పైకి ఎత్తి సముద్ర మధనానికి వీలు కలిగించాడు.
కూర్మావతారం ఆంధ్రదేశంలో పూజితమవుతూ ఉంది.