పుట:PandugaluParamardhalu.djvu/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భక్తులు పువ్వులు తెచ్చారు. కాని ఆసమయంలో బుద్ధుడు ఎక్కడికో వెళ్లి ఉన్నాడు. భక్తులు బుద్దుని దర్శనం కోసము చాలాసేపు వేచి ఉన్నారు. ఎంత సేపటికిన్నీ బుద్ధుడు రాలేదు. బుద్దుని దర్శనం కాక భక్తులు నిరుత్సాహులై ఆ పువ్వులు అక్కడే వదలి వేసి వెళ్లిపోయారు. జేతవన విహారదాత అనంత పిండకుడు పరిస్థితి చూఛాడు. పూజకు వినియోగం కావలసిన ఆ పుష్పాలు అట్లా అక్కడ నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. కాగా బుద్ధుడు రావడంతోటే అనంత పిండికుడు ఈ విషయం చెప్పాడు. అతను లేనప్పుడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలు అతను ఒప్పుకోలేదు. బోధివృక్షం పూజకు మాత్రం అతను అనుమతించాడు. తన జీవితకాలంలోనూ, తదనంతరంఓఓ ఏఏ ఒక్కవిధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని అతడు చెప్పాడు.

  అదుమీద జేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు.  గయలోని బోదివృక్షం నుండి విత్తనం తెప్పించ్ది నాటారు.  అప్పుడు ఒక గొప్ప ఉత్సవం సాగింది.  కోసలదేశపు రాజు తన ఉదొయ్గులతో, అనుచరులతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు.  వేలాది బౌద్ధభిక్షువులు వచ్చారు.
   ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్ధులలొ ప్రబలింది. ఆ పూజ ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణీమనాదు సాగించడం ఒక ఆచారమైంది.  ఇప్పుడు బౌద్ధమతం ప్రబలి ఉన్న అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాదు బోధి వృక్షపూజ సాగుగూ ఉంది.
     ఆనాడు బౌద్ధులు బోధి వృక్షానికి జెండాలు కట్టి, దీపాలు పెట్టి మొదట్లో పరిమళజలాన్ని పోస్తారు.  హీనయాన బౌద్ధమతాన్ని అవలబించే బర్మాలో ఈ ఉత్సవం ఈనాటికిన్నీ చూదతగి ఉంటుంది.  రంగూను, పెరు, మాండలే మున్నగు బర్మాబస్తీల్లో ఈ పండుగను నితాంత వైభవంతో చేస్తారు.  ఈ ఉత్సవం కొంచెం ఇంచుమిందు రోజల్లా ఉంటుంది.  ప్రతి ఇంటిలోని స్త్రీలు పరిమళ జలబాండాన్ని తలపై ధరించి బయలు దేరుతారు.  మేళతాళాలు ఉంటాయి.  వెనకనుంచి దీపాలు, జెండాలు పట్టుకు వస్తారు.  బస్తీ నాలుగు మూలలనుంచీ ఇట్లా బయలు దేసిన ఉత్సవాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి.  సమ్మర్ధదారుణమైన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది.  లోపలి దేవాలయానికి ముమ్మారు