పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1 కృష్ణార్జునుల యమునాతీర విహారకథ.

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడును, నారాయణ శోడశకళాంశసంభూతుండును, జగన్నాటక సూత్రధారియు జగజ్జేగీయమానకోమలశ్యామలాకారుండును, యమ, నియ, మాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, నిష్ఠాగరిష్ఠుండును, స్థావరజంగమాద్యభికృదార్ధాంతర్యామియు, యోగిజనహృన్మండల మండితాంతర్వర్తియుఁ ద్రిమూర్త్యాత్మకదివ్యస్వరూపియు, భక్తజనాభయప్రదానశీలుడుసు, చిదానంద విగ్రహుండును, జ్ఞానప్రపూర్ణతేజోరాశియునగు శ్రీమన్నారాయణుండు, భూభారావతరణార్ధమై శ్రీకృష్ణ నామధారియై మానవయోని నుద్భవించి, భూలోకై కకైవల్యంబునాఁ బ్రసిద్ధంబైన ద్వారకాపురంబున సమస్తయాదవలోక చక్రవర్తియై లీలా వినోదంబులం దేలియుండుచుండ, నొక్కదినంబున, తద్దేవదేవుని జననీ జనకులగు దేవకీవసు దేవులు, కృష్ణవిలాసమందిరాభ్యంతరంబున కరు దెచి, తద్దేవ దేవునివలనను, అష్టమహిషీమండలమునలనను, స్కొ రోదిసన్మానములంబడసి సుఖాసీనులై యున్నంత. దేవకీ దేవి దరహ సీతాననాబ్జ యై నిజపుత రత్న ముందిలకించి, "కుమారా! కతిపయదినం బులకుఁ బూర్వము కుంతీసుత మధ్యముండును, నీమేనమబిందియునగు పార్ధుండు భూప్రదక్ష్మి ణమిషంబున రైవత కాద్రిసీమణ గొన్ని దినంబులు సన్యాసి వేషంబున, నివసించియుండుటయు. తత్పూజార్ధమై నీరున్న యగు బలభద్రునిచే నియమితయైన నీ చెలియలగు సుభద్రయచు