పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

పండ్రెండురాజుల కధలు


చిత్తంబుహత్తించి, గాంధర్వవిధిం బరిణయం బాడి, యతిరహస్యంబుగ నాబాలంగొని, నిజనివాసంబున కరుగుటయు, నీకు సువేద్యంబులే యగుట వెండియుం బునరుక్తిగా వచింపంబని లేదు. అన్యోన్య ప్రణయ నిబద్దమానసులును, మేనత్త మేనమామబిడ్డలును నగు, సుభద్రార్జునుల వివాహమునకు మనమందఱమును నామోదించి వారల సన్మానించుటయే కర్జంబని, నీతండ్రిగారును, మనకులవృద్ధులును సయితము నిర్ణయించియున్నవారు; కావున నీవు కతీపయ సేనాసమేతుండవై —— శుభ వస్త్రాభరణాలంకారాదులంగాని యింద్రప్రస్థంబుసకరిగి, చెల్లెలిని,మేనమఱందిని సన్మానించిరమ్ము. ఇదినీకవశ్యాచరణీయం” బని యాజ్ఞ యొసంగ నయ్యాదవకిశోరుఁడు వల్లెయని మాతృశాసనఁబు నౌదల ధరించి, యింద్రప్రస్థంబున కరుగ నాయత్తుండయ్యె.

అనంతరము—— భగవానుండగు శ్రీకృష్ణుడు, ధారాధరోపమానంబులగు, దివ్యస్యందనములతోడను, దిగ్దంతావళతుల్యంబులగు దంతావళంబులతోడను, నువ్ఛైశ్రమసమంబులగు తురంగంబులతోడను, గంధర్వకాంతా తిలకింబుల నపహసించు సుందరదాసీజనసహ స్రంబుతోడను, నవరత్న ఘటితా మూల్యాభరణ చీనీ చీనాంబరంబుల తోడను, విచిత్రసాలభంజికలతోను, యనంతసుగంధ ద్రవ్యంబుల తోడను, భేరీ భాంకారాది మంగళవాద్యంబులతోడను, దివ్య స్యందనంబు నొండధిరోహించి, ద్వారాకాపురంబునువదలి యింద్రప్రస్థ నగరాభి ముఖుండై నిర్గమించుడరి నప్పురింగల, మత్తకాశివులు చిత్తజతూణీరా యత్తంబులగు చిత్తంబు లుత్తలపాటునొంద, చిత్తజ మోహనుండగు నప్పురుషోత్తముని వియోగంబునకుఁదాళజాలక, మగిడి యనతి కాలంబున నా దేవదేవుని దివ్యదర్శనముం దమకుఁగల్గించునిమిత్తము, పర మేశ్వరధ్యానంబుల నొనరింపసాగిరి.

అట్లు పయనంబైన మానవుం డనతి కాలంబున నింద్రప్రస్థంబునకుఁ జేసి, ముందుగాఁ దమరాకం బాండవ సహోదర పంచకంబున కెఱిఁ