పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

పండ్రెండురాజుల కథలు


కావించిరి. మహారణ్యంబునందు బోనులో నాహారపానీయ నిద్రాదులు లేక యేడుదినంబులు గడపి మరణాసన్న యైయున్న ధారుణి తన్మార్గంబుననే విరక్తిచే నరుగుచున్న వీరుఁడు పొడగాంచి యామెను రక్షించి వెలికిఁదీయ నామె రాజు తన కొనరించిన యపరాధమును చిత్రపై నాతని కవిశ్వాసముఁ గల్గుటకై తన్నాధారముగాఁ జేసికొని కావించిన తంత్రమునుఁ దెలిపి ప్రాణంబులు బాసెను. అంతట వీరుఁడు మహాపశ్చాత్తాప దుఃఖితుఁడై మరల జగన్నాధాలయంబున కరిగి జఱిగిన సర్వ వృత్తాంతముల నెఱిఁగింప నమ్ముని యాదేవాలయ భూగర్భమునంగల గుప్త మార్గంబున వీరుని వెంటనిడుకొని చని యొక పర్వత ప్రాంతముం జేసి సాంకేతికము నూదినంత, తండోప తండములగు సేనలు వివిధాయుధములలో బిలబిల నటకరుదెంచి యోగికి మ్రొక్కి నిలిచిన నాతఁడా సేనల వీరునకుఁజూపి, “వత్సా! వీరందఱును క్రూరసేనుని దౌర్జ్యమున కోర్వఁజూలక పితూరి యొనరింప సిద్ధమైన రాష్ట్రీయజనులు. నేటికి క్రూరబాహుని పాపములు పండినవి. వీరందఱికిని నీవు నాయకుఁడవై ముందునడిచి రణరంగము నందాతని నిర్జింపు" మని పలుక వీరుఁడు మహానందము నంది సేనలతో దండయాత్రకు బయలుదేరెను. ఈలోన, క్రూరబాహువు చిత్రను పరిణయమాడ సర్వసన్నాహములనుఁ గావించి కల్యాణ మందిరమునందుండెను. ఇంతలో భయంకరంబగు భేరీ నినాదంబును పురంబును కొల్లగొను శాత్రవుల సవ్వడియు వినంబడుటయు, నాతఁడు భయకంపితుఁడై కల్యాణ రంగమునుండి కదనరంగము నందడుగువేసెను. ప్రచండమగు రాష్ట్రీయ ప్రజాసైన్యమునకు తాళఁజాలక రాజసైన్యము పటాపంచలై పోవ రాజు బంధింపఁబడియె——దీనవదనుఁడై యున్న క్రూరబాహుని చుట్టునుమూగి ప్రజలు పరిహసించుచు శూలములవంటి పోటుమాటలతో నొప్పించుచుండ నటకు సచ్చిదానంద యోగి యరుదెంచి ప్రజలనందఱంగాంచి "యోమహాజనులారా! క్రూరబాహువు బంధింపఁబడియెఁ గావున నికమీదట నీకుఱ్ఱడే