పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరబాహుమహారాజు కథ.

39


కరణి గర్జించుచు రయంబున నరుదెంచి, యారాజు పైఁబడి ప్రాణావశిష్టునిగాఁ బ్రహరించి చిత్రను రక్షించెను.పురమధ్యంబునఁ దనకుఁ గల్గిన మహావమానంబును సహింపనోపక క్రూరబాహువు వీరుని పట్టి బంధింప శాసించి యనేక యోధులనంపెను. అత్యంత పరాక్రమబాహువగు వీరుడు తద్యోధులంద నేకులను హతమార్చి తక్కుంగలవారికిఁ జిక్కక, పటురయంబున శ్రీజగన్నాధస్వామి యాలయమునం బ్రవేశించెను. రాజభటులు దేవాలయ ప్రవేశంబునకు వెఱచి వెనుకకుమఱలి రాజుతో సర్వవిషయంబులను. నివేదించిరి. అట్లు జగన్నాధ దేవాలయముంబ్రవేశించిన వీరుఁడు తదాలయంబునఁ బూజ్యుఁడై యనేక శిష్యగణంబుతో వసించి యున్న, సచ్చిదానంద మహర్షి పాదంబులనాశ్రయించెను. పుణ్యాత్ముండగు, నమ్మహర్షి, యాకుమారు నాశీర్వదించి, “వత్సా! భీతిల్లకుము. పవిత్రంబగు నీపుణ్యభూమిం జేరఁగలిగిన నీకు క్రూరబాహుని భటులవలన నపాయముఘటిల్లదు. నీవు మాశిష్యకోటియం దొకండవై తరింపుము నీకు——తరుణోపాయముగా——పంచముద్రల తెఱంగెఱింగించెదము. సావధానుఁడవై యాళర్ణింపు"మని పలికి వెండియు పంచముద్రల రహస్యంబు నెఱిఁగించెను.

ఇది యిట్లుండ, నిచ్చట——పరాభూతుండైన క్రూర బాహువు తానేవిధంబునంగాని యాచిత్రను పరిణయమాడంగోరి, యామె తలిదండ్రుల కమితధనంబునొసంగి నిజేప్సితంబు నెఱిఁగింప నానిరుపేదలు రాజబాంధవ్యంబునకన్న నధికంబగు భాగ్యము వేరొండుగలుగదని, యుబ్బి తబ్బిబ్బయి, వల్లేయని నరపాలునకు వాగ్దానంబొనరించిరి. అంత నారాజు బలాత్కార వివాహంబునకై సర్వసన్నాహంబుల నొనరించు చుండెను. ఈవార్త క్రమక్రమంబుగ, వీరుని చెవిసోకనాతఁడు తామరాకులోని నీటివలె తత్తరమునందు చిత్తముతో, సచ్చిదానందుని పాదమలంబడి యాచిత్రను రక్షింపనరుగ నానతి యొసంగుమని ప్రార్థించెను. అంతనాముని భవితవ్యమునుగుణించి, చూచి, “వత్సా! ఇప్పుడు నీకరిష్ట