పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణార్జునుల యమునాతీర విహారకథ

5


సామ్రాజ్య పదంబు లభింపఁగలదో దయతో నెఱిఁగించి ననుంగృతార్ధునిఁగా నొనరింప వేడెద!"

ఇట్లప్రార్ధించి ముకుళితకరకమలుండైన విజయునిఁ గాంచి, త్రివిక్రముండు——"సవ్యసాచీ! నీవు కోఱిన సంప్రశ్నంబు నాహృదయంబున కత్యంతానందంబును ఘటింపఁ జేసె—— నీవు తొల్లి బదరికావన తాపసివగు నరుండవగుటం జేసియు తత్కాలంబున నీకుగల్గిన నారాయణ ఋషీంద్రుని సాహచర్యంబునం జేసియు, భగవదంశ నీయందుండుటం జేసియే నీకిట్టి ప్రశ్నంబొనరింపఁ జిత్తంబుగలిగెఁగాని, యన్యులకుఁ గలుగదు. నీవు ధన్యాత్ముండవు, విదేహంబగు కైవల్యమే 'మోక్షమనంబఱఁగు, అది శత్త్వకోవొదులగు వారలకు మాత్రమే లభ్యంబగు పదార్థము. తోల్లి, భరద్వాజ, కశ్యపాత్రి వసిష్ట వామ దేవగౌతమగా ర్గేయనారదకణ్వ విశ్వామిత్ర వ్యాసవాల్మీకి, కపిలశుకశౌనకాది దివ్యచంద్రులును, ప్రహ్లాదాంబరీష, ధృవ, రుక్మాంగద జనకాది రాజర్షులును, భగవ భక్తిభరితులై వేదాంత రహస్యంబు నామూలంబుగా నెఱింగి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి నొంది మోక్షముం గాంచిరి. బ్రహ్మజ్ఞానము చేతను వేదాంత పరిజ్ఞానమువలననే కాక, వేఱోండువిధంబున మోక్షంబునంద సాధ్యంబుగా నేరదు. మంత్రతంత్రాదులుసు, షణ్మతంబులును, సాకారధ్యానంబును, దారులో హశిలాద్యాకార సంపూజనంబును, త్రిగుణధ్యానమననాదు లును మోక్షమార్గంబులని మూఢులు విశ్వసింతురేకాని ప్రాజ్జులు తలంపఁబోవరు.తత్త్వమస్యాది మహావాక్యంబుల నెఱింగి, నిరాకార బ్రహ్మంబగు నాత్మను ధ్యానించుచు, అర్చనాది సత్కారంబులను సాకార సద్గురు బ్రహ్మంబునకు గావించుచు జన్మసాఫల్యతనొందుటయే మోక్షముంగాంచుట యని యెఱుంగుము.” అని యెఱింగించిన నర్జునుండు కృష్ణునకు సాష్టాంగ నమస్కారంబొనరించి —— "మహానుభావా! నాభాగ్యమూలంబున లభియించిన నీవే నాకు సద్గురుండవు. తమ రిప్పు డానతిచ్చిన వేదాంత రహస్యం బెన్ని విధంబులుగా గల్గి దేవ మాన