పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

పండ్రెండు రాజుల కథలు


వాదులకు తరణోపాయ మైయున్నదో క్రమంబుగ నెఱింగింప వేడెద!" నని యడుగ, కృష్ణుం డర్జునుం జూచి——

“యర్జునా ! సావధానుండవై యాకర్ణింపుము. వేదాంతమార్గంబు ద్వాదశవిధంబై —– సొంఖసూత్ర, ఛాయాపురుష, నాదానంద, పంచముద్ర, తారకమంత్ర, సచ్చిదానంద, సాకార, నిరాకార, అమనస్క, దర్పణ, యెఱుక, అచల పరిపూర్ణ, నామంబులం బఱగు చున్నది. ఈ ద్వాదశమార్గంబుల నెఱింగినవాఁడు మోక్షంబునొందుటకు సందేహము లేదు. కావున నిందలి ప్రథమోయంబగు, సాంఖ్య సూత్రంబును గుఱించిన పుణ్యకథ నొక్కదాని నెఱిఁగించెద—— నాకర్ణింపు" మని యిట్లు చెప్పదొడంగెను.