పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలపయు మట్టి ఱాల నిడి కట్టిన దేవళమందు నీకు నే
ఫలము లభించు? ప్రేమరస భావయుతుండవయేని కామినిన్‌
వలవుము; ప్రాణహీనమగు బండలు వేయిటికన్న శ్రేష్ఠమై
యలరుఁగదా మనుష్యహృదయంబు ప్రతిప్రణయానురక్తులన్‌.

దేవ, నీవులేని గుడిఁ బ్రార్థించుకంటెఁ
బానశాలను సత్యంబు పలుక మేలు;
సృష్టి కాద్యంతములు నీవె; స్రష్టవీవె;
పాలముంచ నీటను ముంచఁ బ్రభువు నీవె.


కొందఱు ధర్మమున్‌ మతముఁగూర్చి నిరంతము చింతసేయ నిం
కెందఱొ సత్యసంశయము లేర్పఱుపం దలదిమ్ము గాంచ, నా
సందున మాటువీడి "యిఁకఁ జాలును లెండు వెడంగులార, మీ
కందును నిందు లేదు పథ" మంచు మునాది వచించువారికిన్‌.