పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మునుపు మసీదువాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతవై
చినిఁగెను; నేఁడునున్‌ మరలఁ జెప్పులకోసము వచ్చినాఁడ; నె
మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపఁగరాను; నీవు చ
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులువోలె నమాజు సైతమున్‌.

సలలితగోస్తనీ ఫలరసంబునుగ్రోలెడువారు, దేవళం
బుల నిశియెల్లఁ బ్రార్థనలఁ బుచ్చెడువారు; జలప్రవాహవీ
చులఁబడి మున్గినారు; పొడిచోటి కొకండును జేరఁ; డొక్కఁడే
యలరుఁ బ్రబుద్ధుఁడై; మిగతయందఱు మత్తులు పెద్దనిద్దురన్‌.

మితిసెడ, సృష్టివేళ్‌ఁ దనుమృత్తిక నెవ్వఁడు మేళవించె; జీ
విత సిచయంబునం బడుగుపేకల నున్నియుఁ బట్టుగల్పె; దు
ష్కృతులను బుణ్యకార్యములఁ జేయ లిఖించెను నొష్ట, వాఁడె మ
త్కృతులకు మూలకారణము, కీడును మేలును వాని సేఁతలే.