23
సందర్శించి యొప్పదలను జ్ఞప్తి పఱచెను. నేను పొదుషా యొద్దకు
తీసుకోనిపోయి రాజాస్థానమున నొక యుద్యోగ మిప్పించితిని.
కొన్ని దినముల కతఁడు పాదుషాకు స్నేహపాత్రుఁడయి ఆయన
బుద్ధిని తప్పుదారులకు లాగుచుండెను. పాదుషా ఆ సవ్వడి కనిపెట్టి
అతని పదభ్రష్టుని గావించెను."
నిజాముల్ ముల్కు వ్రాతనుబట్టి ఖయ్యాము ఉద్యోగా పేక్ష,
లేనివాఁడనియు విజ్ఞానసంపాదనమునందె నిమగ్నుఁడయి శాంత
ముగ కాలము గడుపుచుండెననియు తెలియవచ్చుచున్నది.
ఖయ్యాము బాల్యయౌవనములనాంటి కాలపరిస్థితులు.
మత నిర్బంధములు, ఆచారముల కట్టుంబాటులు, ఇహలోక ద్వేషము, వైరాగ్యము పెచ్చు పెరిగి మానవజీవితము యంత్ర ప్రాయమైనపుడు తిరుగుఁబాటుకూడ తలచూపుచుండును. పారసీ కమున ఇట్టి తిరుగుబాటు పదియవ శతాబ్ది ప్రారంభమున పొడకట్టి నది. గ్రీకు అరబ్బీ ప్రకృతిశాస్త్ర గ్రంథముల మూలమున భౌతికవిజ్ఞు నము విద్యావంతులలో క్రమక్రమముగ వ్యాపించివది. మూడ భక్తియు అర్థములేని మతాచారముల పైని విశ్వాసమును సన్నగిల్లఁ జొచ్చినది. స్వాభావికముగ హేతువాదవరమైన ఖయ్యాము మనస్తత్వమునకు ఈ పరిస్థితులనుకూలమై యుండినవి.
ఖయ్యాము జన్మించిన సంవత్సరముననో లేక యొక సంవత్స
రము ముందుగనో ఇబిన్ సీనా మరణించెను.అతడు మహాప్రతిభాశాలి; కవి;
పండితుఁడు; విజ్ఞానశాస్త్రవేత్త ; గణితశాస్త్రజ్ఞుడు; జ్యోతిష్కుఁడు; వైద్యుఁడు; రాజకార్యనిర్వాహకుఁడు; భోగప్రియుండు. ఇబిన్ సీనా రసాయన శాస్త్రమునందు పరిశోధనలు కావించెను.ఒక ప్రసిద్ధ వైద్యగ్రంథమును, ఆత్మావతరణమను ఖండకావ్యమును,అషఫా అను తత్త్వశాస్త్రమును రచించెను. దేవుఁడద్వయుఁడనియు,