పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22


చాలా కొంతకాలము జరిగిన వెనుక నేను నిషాపూరునుండి వెడలిపోయి అల్ ప్ అర్చలాన్ ప్రభువునొద్ద మంత్రిత్వము నిర్వహించుచుంటిని. హకీం ఉమఖయ్యాము నా యొద్దకు వచ్చెను. మేముపూర్వము కావించుకొన్న యొప్పదలను నాచేతనై సంతవఱకు నెర వేర్పతలంచి గౌరవ పురస్సరముగ నిట్లంటిని: 'మీరు మేధావంతులు, మీరేదియైనా నొక రాజోద్యోగము నిర్వహింపవలయునని నాకు కోరికగనున్నది. ఏలన, ఇమాంమువఫిక్ గారీ యొద్ద విద్యార్థులమై యుండినపుడు మనము ఇటువంటి షరత్తు చేసికొని యున్నాము. మీ పొండిత్యమును ప్రతిభను గుఱించి పాదుషాకడ విన్నవించెదను. తరువాత మీరును నావలెనే యున్నత స్థితికి రావచ్చును.' ఈ మాట లకు ఖయ్యామిట్లు చెవ్పెను: “మీరాడిన మాటలు మీకులీనతకును హృదయ కారుణ్యమునకు, గొప్పతనమునకు తార్కాణముగ నున్నవి,అయినను పూర్వ పశ్చిమరాష్ట్రముల వజీరులు మీవలెనే నాబోటి యల్పుని గురించి తలపోయుదురని ఏమి నమ్మకము కలదు. ఎట్లయి నను తమవంటి గొప్పవారికి అసాధ్యమగునది యేదియులేదు. నాబోటి సొమాన్యునిపై తమరింతటి శ్రద్ధ వహించినందుకు యావజ్జీవము నేను మీకు కృతజ్ఞుఁడను. తమ కరుణ యున్నయెడల నేనొక మూల కూర్చుండి గ్రంథకాలక్షేపము చేయుచు విద్యార్థులకు పాఠము చెప్పుచు తమరీ ఆయురారోగ్వైశ్వర్యములు ఇతోధికముగ అభివృద్ధి చెందునటుల దేవుని ప్రార్థించుచుండెదను. "హకీము గారికి ఉద్యోగా వేక్ష లేదని నిశ్చితముగ నెఱింగి సాలీనా 1200 తోమానులు ఆదా యమువచ్చు జాగీరును నిషాపూరున నొసంగితిని. అంతట హకీం ఉమఖయ్యాము ప్రకృతి శాస్త్రములు, కళలు మున్నగువానియందు ప్రావీణ్యము సంపాదించుచుండెను.

“హసన్ బిన్ సబాహు ఆల్ ఏ అర్సలాన్ రాజ్యకాలమున నెచ్చట నుండినదియు నెవ రెఱుంగరు. అర్సలాన్ మరణానంతరము నేను మలిక్ షా ప్రభుత్వమున మంత్రినిగా నున్నపుడు అతఁడు