పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

వలె సూస్యమైనట్లు పొరసీక కవుల సాయిక 3[1] నోరు మొట్టమొదట ఇందుపంతయలు క్రమముగా పూడుకొనివచ్చి, చీమ హృదయ మంత యయి, నూదిమొనయంతయయి. కడపటికి అర్థముగాని సూక్తి లో దాగియున్న భావమువలె శూన్యమగును! ప్రణయ కలహముచే మాట లాడకున్న నాయికనుంచి నాయకుఁడు “నీనోరు చీమహృదయమంత చిన్నదైనందున మాటలాడఁజాల కున్నావని” వ్యాజస్తుతి చేయును.


వెదవి వైని పుట్టుమచ్చను వర్ణించునపుడు “హిందు” అను పద మును శ్లేషించి చమత్కరింతురు. (హిందు దొంగ, నల్లని బానిస, విగ్రహారాధకుఁడు అని అర్థము) “నీ పెదవి పై నిరవుకొన్న తిలక మును దప్ప కౌసరు నదీతీరమున హిందువు నెవరుచూచిరి. (సర్ కుష్ నామా). కొసరు స్వర్గమున ప్రవహించు తేనెవాఁగు, పొరసీ యందు “లబ్” అను పదమునకు వాతెజయనియు, ఏటిగట్టనియు, అనియు అర్థములు కలవు. ఇచ్చట వెదవి కౌసరునకు, పుట్టుమచ్చ హిందువునకు పోల్పఁబడినది. మహమ్మదీయుల స్వర్గ మునందు హిందువు ఉండడనియు ధ్వనించును. “ఓ ప్రేయసీ, నీ చెక్కుల పై నుండునది పుట్టుమచ్చకాదు; సూర్యోపాసకుఁడగు హిందూబాలుఁడు," అని మఱియొక కవి వ్రాసెను. పుట్టుమచ్చ యను హిందూబాలుఁడు ముఖమను సూర్యుని అర్చించుచున్నాఁడని భావము, విరహ విహ్వలుఁడగు కాముకుని దీపమునంబడి మాడిపోవు మిడుతకు సరిపోల్తురు, ప్రేయసీ కొరకు ప్రియుఁడు నిశ్చింతముగ ప్రాణ పరిత్యాగము చేయును. ప్రణయ సాహిత్యమునందు లైలామజ్నూనుల కథయు, షీరీను ఫర్హాదుల కథయు కఠిన చిత్తుని హృదయమునైన కరఁగింపఁజాలినంత కరుణరస భరితములుగ నున్నవి. షానామావంటి రాజచరిత్రలు, షీరీసుఫర్హాదులవంటి కథాకావ్య ములు తప్ప తక్కిన గజలు వాజ్మయమున భావనవ్యత యగపడదు.


3

  1. నోరు చిన్నదిగ నుండిన చాల రమణీయమని మంగోలియన్ జాతులఅభిప్రాయము.